టీ20 సిరీస్‌ భారత మహిళలదే | India beat Srilanka to Clinch T20 Series | Sakshi
Sakshi News home page

టీ20 సిరీస్‌ భారత మహిళలదే

Sep 24 2018 3:15 PM | Updated on Sep 24 2018 3:20 PM

India beat Srilanka to Clinch T20 Series - Sakshi

కొలంబో: శ్రీలంకతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను భారత మహిళలు ఇంకా ఒక మ్యాచ్‌ ఉండగానే చేజిక‍్కించుకున్నారు. సోమవారం జరిగిన నాల్గో టీ20లో భారత మహిళల జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను సాధించారు. శ‍్రీలంక నిర్దేశించిన 135 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింద. వర్షం కారణంగా 17 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో భారత ఓపెనర్లు మిథాలీ రాజ్‌(11), స్మృతీ మంధాన(5)లు విఫలమైనప్పటికీ, జెమిమా రోడ్రిగ్స్‌(52 నాటౌట్‌;37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), అనుజా పాటిల్‌(54 నాటౌట్‌; 42 బంతుల్లో 7ఫోర్లు) రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

రోడ్రిగ్స్‌ సిక్స్‌తో ఇన్నింగ్స్‌ను ముగించారు. ఈ జోడి అజేయంగా 96 పరుగులు జోడించడంతో భారత్‌ 15.4 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. దాంతో సిరీస్‌ను 3-0 తేడాతో సొంతం చేసుకుంది. రెండో టీ20 వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. ఇక నామమాత్రపు ఐదో టీ20 మంగళవారం జరుగనుంది.

Advertisement
 
Advertisement
Advertisement