హైదరాబాద్‌ టి20 క్రికెట్‌ జట్టు ప్రకటన | Hyderabad t20 cricket team announced | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ టి20 క్రికెట్‌ జట్టు ప్రకటన

Jan 2 2018 10:31 AM | Updated on Sep 4 2018 5:32 PM

సాక్షి, హైదరాబాద్‌: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ సౌత్‌జోన్‌ ఇంటర్‌ స్టేట్‌ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో పాల్గొనే హైదరాబాద్‌ జట్టును సోమవారం ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా అంబటి రాయుడు, వైస్‌ కెప్టెన్‌గా పి. అక్షత్‌ రెడ్డి ఎంపికయ్యారు. ఈ జట్టుకు డి. కిషన్‌ రావు మేనేజర్‌గా వ్యవహరించనున్నారు. విశాఖపట్నంలో జనవరి 8 నుంచి 14 వరకు ఈ టోర్నీ జరుగుతుంది.  

జట్టు వివరాలు: అంబటి రాయుడు (కెప్టెన్‌), పి. అక్షత్‌ రెడ్డి (వైస్‌ కెప్టెన్‌), తన్మయ్‌ అగర్వాల్, బి. సందీప్, ఎ. ఆశిష్‌రెడ్డి, మొహమ్మద్‌ సిరాజ్, ఎం.రవికిరణ్, మెహదీహసన్, ఆకాశ్‌ భండారి, టి. రవితేజ, సుమంత్‌ కొల్లా (వికెట్‌ కీపర్‌), పి. రోహిత్‌ రెడ్డి (వికెట్‌ కీపర్‌), పి. సాకేత్‌ సాయిరాం, ప్రజ్ఞాన్‌ ఓజా, తనయ్‌ త్యాగరాజన్, కార్తికేయ, డి. కిషన్‌రావు (మేనేజర్‌), జె.అరుణ్‌ కుమార్‌ (కోచ్‌), ప్రతాప్‌ సింగ్‌ (ఫిజియో), నవీన్‌ రెడ్డి (ట్రైనర్‌).   


 

Advertisement
 
Advertisement
Advertisement