ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో విషాదం | Fan dies in Argentine football violence | Sakshi
Sakshi News home page

ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో విషాదం

Apr 18 2017 3:56 PM | Updated on Oct 2 2018 8:39 PM

వినోదాన్ని పంచాల్సిన ఫుట్‌బాల్‌ మ్యాచ్.. అభిమానం హద్దులు దాటడంతో విషాదాన్ని మిగిల్చింది.

బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా)‌: వినోదాన్ని పంచాల్సిన ఫుట్‌బాల్‌ మ్యాచ్.. అభిమానం హద్దులు దాటడంతో విషాదాన్ని మిగిల్చింది. అర్జెంటీనాలో ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ సందర్భంగా స్టేడియంలో ఇరు జట్ల అభిమానులు ఘర్షణ పడటంతో ఓ అభిమాని తీవ్రంగా గాయపడి మరణించాడు.

బెల్‌గ్రానో, టాలెరెస్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ 1-1తో డ్రా అయ్యింది. స్టేడియంలో మ్యాచ్‌ తిలకిస్తున్న ఇరు జట్ల అభిమానులు పరస్పరం దాడికి దిగారు. ఈ దాడిలో ఎమాన్యుల్‌ బాల్బో అనే అభిమాని తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా, కోమాలో ఉన్నట్టు వైద్యులు చెప్పారు. ఆ తర్వాత అతన్ని బ్రెయిన్‌ డెడ్‌గా ప్రకటించారు. ఎమాన్యుల్‌ మృతిపై ఫుట్‌బాల్‌ సంఘాల అధికారులు దిగ్భ్రాంతి చెందారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనను జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని, అభిమానులు ఇలా దాడులకు దిగడం సరికాదని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement