అంపైర్‌కే అర్థం కాలేదు..!

Englands Kate Cross Commits a Blunder by Missing an Easy Run Out - Sakshi

నార్తాంప్టన్‌: మహిళల క్రికెట్‌లో భాగంగా ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య శుక్రవారం జరిగిన రెండో టీ20లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లండ్‌ బౌలర్‌ కేట్‌ క్రాస్‌ చేసిన పొరపాటు ఇప్పుడు సోషల్‌ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. వివరాల్లోకి వెళితే.. లక్ష్య ఛేదనలో భాగంగా కేట్‌ క్రాస్‌ వేసిన బంతిని వెస్టిండీస్‌ బ్యాటర్‌ షాట్ ఆడగా.. బంతిని ఫీల్డర్ అందుకుని కేట్‌ క్రాస్‌కు త్రో విసిరారు. షాట్ ఆడిన బ్యాటర్‌ నాన్‌స్ట్రైకింగ్‌ వైపు పరుగెడుతున్నా.. కేట్‌ క్రాస్‌ అది గమనించకుండా కీపర్‌ వైపు పరుగెడుతున్న బ్యాటర్‌ని ఔట్‌ చేసేందుకు ప్రయత్నించింది.

కీపర్‌ వైపు బంతి వేసే సమయంలో ఆ బ్యాటర్‌ క్రీజులోకి వెళ్ళింది. క్రాస్‌ బంతిని కీపర్‌ వైపు వేసే సమయానికి స్ట్రైకింగ్ బ్యాటర్‌ (షాట్ ఆడిన బ్యాటర్‌) సగం క్రీజులోకి మాత్రమే రావడం విశేషం. అయితే ఫీల్డ్‌ అంపైర్‌కు మాత్రం ఆమె రనౌట్‌కు యత్నించిన క్రమంలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. రనౌట్‌ నాన్‌ స్ట్రైకింగ్‌ ఎండ్‌లో చేయడం మానేసి.. స్ట్రైకింగ్‌ ఎండ్‌లో బంతిని వేయడంతో అంపైర్‌ కాస్త గందరగోళానికి లోనయ్యాడు. కేట్‌ క్రాస్‌ చేసిన తప్పిదంతో ఏ బ్యాటర్ కూడా అవుట్ కాలేదు. కేట్‌ క్రాస్‌ పొరపాటు చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. కేట్‌ క్రాస్‌ మూడు ఓవర్లు బౌలింగ్‌ చేసి వికెట్లేమీ తీయకుండా 30 పరుగులిచ్చారు.. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసి ఓడిపోయింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top