భారత మహిళల ఓటమి | England women vs India women,England win by 42 runs (D/L Method) | Sakshi
Sakshi News home page

భారత మహిళల ఓటమి

Aug 22 2014 12:51 AM | Updated on Sep 2 2017 12:14 PM

భారత మహిళల ఓటమి

భారత మహిళల ఓటమి

టెస్టు మ్యాచ్ గెలిచిన ఉత్సాహంతో ఉన్న భారత మహిళల జట్టును తొలి వన్డేలో ఇంగ్లండ్ నిలువరించింది.

ఇంగ్లండ్‌తో తొలి వన్డే
స్కార్బోరోగ్ (ఇంగ్లండ్): టెస్టు మ్యాచ్ గెలిచిన ఉత్సాహంతో ఉన్న భారత మహిళల జట్టును తొలి వన్డేలో ఇంగ్లండ్ నిలువరించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఇంగ్లండ్ 42 పరుగుల తేడాతో నెగ్గింది. భారత ఇన్నింగ్స్ 18వ ఓవర్లో వర్షం రావడంతో మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. ఓపెనర్ స్మృతి మందానా (99 బంతుల్లో 74; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ సహాయంతో భారత్ 47 ఓవర్లలో 8 వికెట్లకు 193 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (59 బంతుల్లో 34; 6 ఫోర్లు)తో కలిసి రెండో వికెట్‌కు మందానా 64 పరుగులు జోడించింది. నైట్‌కు మూడు వికెట్లు దక్కాయి.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 5 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసిన సమయంలో వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్‌ను 42 ఓవర్లకు కుదించి 184 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఓపెనర్లు ఎడ్వర్డ్స్ (64 బంతుల్లో 57; 9 ఫోర్లు), నైట్ (71 బంతుల్లో 53; 6 ఫోర్లు) జోరుతో 30.1 ఓవర్లలో ఇంగ్లండ్ మూడు వికెట్లకు 153 పరుగులు చేసింది. ఈ సమయంలో మళ్లీ భారీవర్షం రావడంతో మ్యాచ్ ఆగిపోయింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఇంగ్లండ్ 30.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోతే 112 పరుగులు చేస్తే గెలిచినట్లు. అప్పటికే 153 పరుగులు చేసినందున... 42 పరుగులతో గెలిచినట్లు ప్రకటించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement