కామన్వెల్త్ లో భారత్ కు తొలి పసిడి | Commonwealth Games 2014, Sanjita Khumukcham Gives India First Gold | Sakshi
Sakshi News home page

కామన్వెల్త్ లో భారత్ కు తొలి పసిడి

Jul 24 2014 10:15 PM | Updated on Sep 2 2017 10:49 AM

కామన్వెల్త్ లో భారత్ కు తొలి పసిడి

కామన్వెల్త్ లో భారత్ కు తొలి పసిడి

కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ బోణీ చేసింది.

గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ బోణీ చేసింది. 2014 కామన్వెల్త్ గేమ్స్ లో భాగంగా ఇక్కడ జరిగిన వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో బారత్ తొలి బంగారు పతకాన్ని సాధించింది. 48 కిలోల వెయిట్‌లిప్టింగ్ విభాగంలో గురువారం జరిగిన  పోటీలో భారత్ కు చెందిన ఖుముక్ చామ్ సంజితా చాను పసిడి పతకాన్ని గెలుచుకుంది. ఈ పోటీలో ఆద్యంతం ఆకట్టుకున్న చాను.. భారత్ కీర్తిని మరోసారి ప్రపంచానికి తెలియజేసింది.

 

ఇదే విభాగంలో భారత్ కు చెందిన మీరాబాయ్ చాను రజత పతకాన్ని సాధించింది. మణిపూర్ కు చెందిన  ఇద్దరు అమ్మాయిలు భారత్ పతాకాన్ని గ్లాస్గో వీధుల్లో రెపరెపలాడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement