వ్రిత్తి అగర్వాల్‌ జాతీయ రికార్డు | Vritti Agarwal sets national record in National Senior Swimming Championship | Sakshi
Sakshi News home page

వ్రిత్తి అగర్వాల్‌ జాతీయ రికార్డు

Jun 24 2026 3:37 AM | Updated on Jun 24 2026 3:37 AM

Vritti Agarwal sets national record in National Senior Swimming Championship

అహ్మదాబాద్‌: జాతీయ సీనియర్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్‌ వ్రిత్తి అగర్వాల్‌ కొత్త జాతీయ రికార్డు నెలకొల్పి స్వర్ణ పతకాన్ని సాధించింది. మహిళల 800 ఫ్రీస్టయిల్‌ విభాగంలో వ్రిత్తి 9 నిమిషాల 05.47 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో ఆమె జాతీయ రికార్డు సృష్టించింది. 2011లో 9 నిమిషాల 06.31 సెకన్లతో రిచా మిశ్రా పేరిట ఉన్న రికార్డును వ్రిత్తి బద్దలు కొట్టింది. 

జాతీయ సీనియర్‌ చాంపియన్‌షిప్‌లో వ్రిత్తి మొత్తం మూడు పతకాలతో మెరిసింది. 1500 మీటర్ల ఫ్రీస్టయిల్‌ ఈవెంట్‌లో రజత పతకం గెలిచిన వ్రిత్తి... 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో కాంస్య పతకం కైవసం చేసుకుంది. 200 మీటర్ల ఫ్రీస్టయిల్‌ విభాగంలో మాత్రం వ్రిత్తి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement