భువీ పునరాగమనం  | Bhuvneshwar Kumar Selected For West Indies | Sakshi
Sakshi News home page

భువీ పునరాగమనం 

Nov 22 2019 3:56 AM | Updated on Nov 22 2019 3:56 AM

Bhuvneshwar Kumar Selected For West Indies - Sakshi

ముంబై: వెస్టిండీస్‌తో పోరుకోసం ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని జాతీయ సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ వన్డే, టి20 జట్లను ప్రకటించింది. గాయం నుంచి కోలుకున్న పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ను జట్టులోకి తీసుకుంది. చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌కు టి20ల్లో చోటిచ్చిన సెలక్టర్లు ఇటీవల బంగ్లాతో టి20లు ఆడిన ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యా, పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌లకు ఉద్వాసన పలికారు. వీరితో పాటు సంజూ సామ్సన్, రాహుల్‌ చాహర్‌లను జట్టు నుంచి తప్పించారు. వీళ్లిద్దరిని బంగ్లాతో జరిగిన టి20లకు తీసుకున్నప్పటికీ ఆడే అవకాశం లభించలేదు. వన్డే, టెస్టుల్లో  పంజా విసురుతున్న పేసర్‌ షమీని తాజాగా టి20లకు ఎంపిక చేశారు. ఈ సీమర్‌ పొట్టి మ్యాచ్‌ (అంతర్జాతీయ)ను చివరిసారిగా 2017లో ఆడాడు. స్పిన్నర్‌ రవీంద్ర జడేజాకు కూడా పొట్టి జట్టులో చోటిచ్చారు. బంగ్లాతో టి20ల్లో ఆకట్టుకున్న శివమ్‌ దూబేకు వన్డేల్లో స్థానమిచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement