అశ్విన్‌ ‘తొలి’ ఘనత

Ashwin became the first spinner for India to take four wickets in England - Sakshi

బర్మింగ్‌హామ్‌: ఇప్పటికే పలు ఘనతల్ని నెలకొల్పిన టీమిండియా ప్రధాన స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తాజాగా మరో అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టు సిరీస్‌లో భాగంగా బుధవారం ప్రారంభమైన తొలి టెస్టులో అశ్విన్‌ విజృంభించాడు. తొలి రోజు నాలుగు వికెట్లను సాధించి ఇంగ్లండ్‌ వెన్నువిరిచాడు. తద్వారా ఆసియా బయట ఆడిన టెస్టు మ్యాచ్‌ల్లో తొలి రోజే నాలుగు, అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన నాల్గో భారత స్పిన్నర్‌గా అశ్విన్‌ నిలిచాడు. మరొకవైపు ఇంగ్లండ్‌ గడ్డపై ఈ ఫీట్‌ సాధించిన తొలి టీమిండియా స్పిన్నర్‌గా అశ్విన్‌ రికార్డు పుస్తకాల్లోకెక్కాడు. మొదటి రోజు ఆటలో అలెస్టర్‌ కుక్‌, బెన్‌ స్టోక్స్‌, జాస్‌ బట్లర్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌ వికెట్లను అశ్విన్‌ సాధించాడు.

ఇలా ఆసియా ఖండం బయట ఆడిన టెస్టుల్లో నాలుగు, అంతకంటే వికెట్లు సాధించిన భారత స్పిన్నర్లలో చంద్రశేఖర్‌(6/94) తొలి స్థానంలో ఉండగా, బిషన్‌ సింగ్‌ బేడీ(5/55) రెండో స్థానంలో, అనిల్‌ కుంబ్లే(5/84)లు ఉండగా, ఇప్పుడు వారి సరసన అశ్విన్‌ చేరాడు. ఇంగ్లండ్‌తో మొదటి రోజు ఆటలో 25 ఓవర్లు బౌలింగ్‌ వేసిన అశ్విన్‌ 60 పరుగులిచ్చి 4 వికెట్లతో సత్తాచాటాడు.

చదవండి: 'రూట్‌' మూసేశారు...

ఇంగ్లండ్‌ కెప్టెన్‌ రికార్డుల మోత

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top