దీదీ మార్ఫింగ్‌ ఫొటోలు.. బీజేపీ నేత అరెస్టు | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 18 2018 4:32 PM

BJP Worker Arrested Sharing Morphed Photos Of Mamata Banerjee In Social Media - Sakshi

కోల్‌కతా : బ్రహ్మచారి ముఖ్యమంత్రులను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు, మార్ఫింగ్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన బీజేపీ కార్యకర్తను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫొటోలను మార్ఫింగ్‌ చేయడంతో పాటు, ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ప్రవర్తించినందుకు అతడిపై కేసు నమోదు చేశారు.

వివరాలు.. మిడ్నాపూర్‌కు చెందిన బబుయా ఘోష్‌.. మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ల ఫొటోలను మార్ఫింగ్‌ చేశాడు. వారిరువురు సన్నిహితంగా ఉన్నట్లుగా ఫొటోలు సృష్టించడంతో పాటుగా వాటికి ఓ పేపర్‌ ఆర్టికల్‌ను జత చేశాడు. ఇవి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ విషయమై ఫిర్యాదు అందడంతో అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఆర్టికల్‌లో ఏముందంటే..
నవీన్‌ పట్నాయక్‌, మమతా బెనర్జీల మార్ఫింగ్‌ ఫొటోలను పోస్ట్‌ చేసిన బబుయా.. ‘సరైన వయసులో పెళ్లి కాని ఓ ‘అబ్బాయి’ పిచ్చిగా ప్రవర్తిస్తాడని తెలుసు. అయితే సరైన వయసులో పెళ్లి కాని అమ్మాయి ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవాలంటే పశ్చిమ బెంగాల్‌ పరిస్థితి చూస్తే అర్థమవుతోంది’ కదా అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. కాగా ఇటువంటి ఫొటోలను సృష్టించడం బబుయాకు కొత్తేం కాదని.. గతంలో కూడా ఇలాగే ప్రముఖులను కించపరిచే విధంగా పలు పోస్టింగ్‌లు పెట్టాడని పోలీసులు పేర్కొన్నారు.

బబుయా ఘోష్‌ పోస్ట్‌ చేసిన మార్ఫింగ్‌ ఫొటో

Advertisement
Advertisement