‘గంటలోపే పచ్చ దొంగల క్షుద్ర దాడి’ | YSRCP MP Vijayasai Reddy Slams Nara Lokesh | Sakshi
Sakshi News home page

‘గంటలోపే పచ్చ దొంగల క్షుద్ర దాడి’

Sep 8 2019 11:09 AM | Updated on Sep 8 2019 2:08 PM

YSRCP MP Vijayasai Reddy Slams Nara Lokesh - Sakshi

ఆ బియ్యం బస్తాలో నీళ్లు పోసి గడ్డకట్టిన బియ్యం ఇస్తారా అంటూ

సాక్షి, అమరావతి : టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌, ఆయన టీం ఉన్మాదంతో రెచ్చిపోతున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. పేద వాళ్లు తినగలిగే బియ్యాన్ని పంపిణీ చేస్తుంటే టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన బియ్యం అందించాలనే ఆశయంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకాకుళంలో పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభిస్తే.. బియ్యం బస్తాల్లో నీళ్లు పోసి గడ్డకట్టిన బియ్యం ఇచ్చారంటూ ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్‌ శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన గంటలోపలే పచ్చ పార్టీ దొంగలు క్షుద్ర దాడి మొదలెట్టారని విమర్శించారు. 

‘మాలోకం, ఆయన టీం ఉన్మాదంతో రెచ్చిపోతున్నారు. పేదలకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలనే ఆశయంతో పైలట్‌ ప్రాజెక్టును సీఎం జగన్‌ శ్రీకాకుళం నుంచి ప్రారంభించారు. పచ్చపార్టీ దొంగలు ఆ బియ్యం బస్తాలలో నీళ్లు పోసి గడ్డకట్టిన బియ్యం ఇస్తారా అంటూ గంటలోపలే క్షుద్రదాడి మొదలు పెట్టారు’  అని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. 

కాగా పేదలకు నాణ్యమైన బియ్యాన్ని గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం నుంచి ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చింది.  ఆ జిల్లాలో 8,60,727 తెల్ల రేషన్‌ కార్డులు ఉండగా.. గ్రామ, వార్డు వలంటీర్లు శనివారం నాటికి 70 శాతానికి పైగా బియ్యం బ్యాగ్‌లను ఇంటింటికీ తీసుకెళ్లి పంపిణీ చేశారు. ఇందుకు 6 వేలకు పైగా వాహనాలను వినియోగించారు.  వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి 100శాతం నాణ్యమైన సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement