ఐదారుగురైనా మిగిలేది అనుమానమే...

సాక్షి, అమరావతి : మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా వ‍్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘తెలుగు ఉద్యమకారుడి అవతారం ఎత్తిన మాలోకానికి నిశ్చితార్థానికి, పెళ్లికి తేడా తెలియట్లేదు. గతంలో జయంతికి వర్ధంతికి బేధం తెలియకుండా మాట్లాడి అభాసుపాలయ్యాడు. మంగళగిరిలో చిత్తుగా ఓడినా ఏ మాత్రం తగ్గకుండా కామెడీ పండించడంలో జోరు కొనసాగిస్తున్నాడు.’ అని ఆయన సోమవారం ట్వీట్ చేశారు.
‘వచ్చే ఆరు నెలల్లో చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష నాయకుడి హొదా ఉంటుందో లేదో చెప్పలేని పరిస్థితి. టీడీపీ ఎమ్మెల్యేల ఆవేదన చూస్తుంటే ఐదారుగురైనా మిగిలేది అనుమానమే. ఇక నారా లోకేష్‌కు రెండోసారి ఎమ్మెల్సీ అయ్యే ఛాన్స్ అస్సలు ఉండక పోవచ్చు. కేసులైనా తప్పించుకోవచ్చని బీజేపీ చంక ఎక్కడానికి చూస్తున్నారు.’ అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఐదు నెలల్లోనే ఎన్ని అబద్ధాలు, పుకార్లు ప్రచారం చేయాలో అన్నీ చేశారు. ఎల్లో మీడియా రేయింబవళ్ళు గింజుకుంటున్నా వారి కుయుక్తులను ప్రజలు పసిగట్టేశారు. దోపిడీ పాలన పోయినందుకు సంతోషంగా ఉన్నారు. ఇంకా నాలుగున్నరేళ్లు ఎలా తట్టుకుంటారో చంద్రబాబు దొంగల బ్యాచ్... అని ఆయన మండిపడ్డారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి