ఇకనైనా మారకపోతే డిపాజిట్లు దక్కవ్‌

YSRCP MP Nandigam Suresh Fires On ChandraBabu Naidu - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్న వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్‌ విమర్శించారు. ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి అడ్డుతుగులుతూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా మారాలని, భవిష్యత్‌లో కూడా ఇలానే వ్యవహరిస్తే టీడీపీకి కనీసం డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో దళితులను అన్ని రకాలుగా మోసం చేశారని ధ్వజమెత్తారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో దళితులను ఓటు బ్యాంకుగానే చూశారని అన్నారు. ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియాన్ని టీడీపీ నేతలంతా కుట్రపన్ని అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. (‘దేవుడా.. బాబుకు మంచి బుద్ధి ప్రసాదించు’)

శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియాతో మాట్లాడిన నందిగం సురేష్‌.. డాక్టర్‌ సుధాకర్‌ విషయంలో పోలీసులు సంయమనంగా వ్యవహరించారని అన్నారు. ‘సీబీఐ విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై డా. సుధాకర్ ఇష్టానుసారంగా మాట్లాడారు. సుధాకర్ వ్యాఖ్యలను టీడీపీ నేతలు సమర్ధించడం దారుణం. చంద్రబాబుది క్రిమినల్ మైండ్. ఆయన కుట్రలను సాగనివ్వం’ అని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top