‘చంద్రబాబు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు’ | YSRCP MLA Ambati Rambabu Slams Chandrababu Naidu In Tadepalli | Sakshi
Sakshi News home page

ఓర్వలేకే సీఎం జగన్‌పై చంద్రబాబు నిందలు : అంబటి

Oct 16 2019 5:33 PM | Updated on Oct 16 2019 8:17 PM

YSRCP MLA Ambati Rambabu Slams Chandrababu Naidu In Tadepalli - Sakshi

సాక్షి, తాడేపల్లి : ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో టీడీపీ కార్యకర్తలు హత్యలకు తెగబడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ద్వజమెత్తారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో అంబటి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరగని విషయాలను జరిగినట్లుగా చంద్రబాబు చూపిస్తున్నారని, అద్భుతమైన అబద్దాలను మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో వైస్సార్‌సీపీ కార్యకర్తను చంపడం దారుణమన్నారు. వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారనే దురుద్దేశ్యంతో తమ కార్యకర్తను హత్య చేశారని, ఈ హత్యకు టీడీపీ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. బాబు తన వ్యాఖ్యలతో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.

ఏపీని మరో బీహార్‌ చేయాలని చూస్తున్నారు
ఓ వైపు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి అద్భుతమెన పాలన చేస్తుంటే మరోవైపు చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంబటి దుయ్యబట్టారు. సీఎం గొప్ప పరిపాలన చూసి ఓర్వలేక చంద్రబాబు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ను మరో బీహార్ చేయాలని చూస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలోనే సీఎం వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిందని, కాపు ఉద్యమం కోసం ముద్రగడ దీక్ష చేస్తే అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. టీడీపీ నాయకులు మానవ హక్కుల కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరగాలని, అప్పుడే టీడీపీ నేతలపై దాడులు జరిగాయో లేదో వాస్తవాలు ప్రజలకు తెలిస్తాయని ఆయన స్పష్టం చేశారు.

‘టీడీపీ నాయకుల మధ్య జరిగిన తగాదాలు, అధికారులపై టీడీపీ నేతలు చేసిన దాడులపై పంచాయతీలు చేసింది చంద్రబాబు కాదా..  ప్రత్యేక హోదా కోసం దర్నాలు చేస్తే జైల్లో పెట్టించారు.  నువ్వా సిగ్గులేకుండా మానవ హక్కుల గురించి మాట్లాడేది.. వనజాక్షి పై చింతమనేని దాడి చేస్తే పంచాయతీ చేసింది నువ్వు కాదా..? ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యంపై మీ పార్టీ ఎంపీ ఎమ్మెల్యే దాడి చేస్తే పంచాయితీ చేసింది నువ్వు  కాదా’.. అని చంద్రబాబును అంబటి రాంబాబు నిలదీశారు. 

చంద్రబాబు అరాచకాలు ప్రజలకు తెలుసు
పంచాయతీలు చేసిన చంద్రబాబే పులివెందుల పంచాయతీ అంటూ సీఎం జగన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన అరాచకాలు ప్రజలకు తెలుసని, జపాన్ కు చెందిన మాకీ సంస్థ ప్రతినిధులు చంద్రబాబు అరాచకాలు గురించి ప్రపంచ దేశాలకు చెప్పారని ప్రస్తావించారు. కోడెల శివప్రసాద్‌, ఆయన కుటంబ సభ్యలు అనేక అరాచకాలకు పాల్పడ్డారని, కోడెలది హత్యా.. ఆత్మహత్యా.. అనేది దానిపై కూడా ఢిల్లీ నుంచి వచ్చే అధికారులు విచారణ జరపాలని సూచించారు. వైఎస్సార్‌సీపీ వల్లే కోడెల చనిపోయాడని ముద్ర వేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, మానవ హక్కుల కమీషన్ నివేదిక చంద్రబాబు చెంప చెల్లిమనిపించేలా ఉంటుందని అంబటి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement