గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే.. | YSRCP Leaders Slams Chandrababu In Kadapa | Sakshi
Sakshi News home page

గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే..

Oct 13 2018 12:28 PM | Updated on Oct 13 2018 4:22 PM

YSRCP Leaders Slams Chandrababu In Kadapa - Sakshi

వైఎస్సార్‌సీపీ నేతలు రవీంద్రనాథ్‌ రెడ్డి, సురేష్‌ బాబు

2014 ముందు ఏడాదికి రూ.50 కోట్ల కాంట్రాక్టు పనులు చేసే రుత్విక్‌ కంపెనీ ఈ రోజు రూ.3500 కోట్ల రూపాయలకు ఎలా వచ్చిందని సూటిగా అడిగారు

వైఎస్సార్‌ జిల్లా: రాష్ట్రంలో ఏమి జరిగినా టీడీపీ నాయకులు గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకుంటున్నట్లు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శించారు. కడప పార్లమెంటు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు సురేష్‌ బాబు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డిలు పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బినామీలలో మొదటి వాడు సీఎం రమేశ్‌ అని ఆరోపించారు. సారా దుకాణం నుంచి వేల కోట్ల రూపాయల ఆస్తికి సీఎం రమేశ్‌ ఎలా వచ్చాడని ప్రశ్నించారు. అనేక మందిని మోసం చేసిన, కడుపుకొట్టి అక్రమాస్తులు సంపాదించారని విమర్శించారు.

2014 ముందు ఏడాదికి రూ.50 కోట్ల కాంట్రాక్టు పనులు చేసే రుత్విక్‌ కంపెనీ ఈ రోజు రూ.3500 కోట్ల రూపాయలకు ఎలా వచ్చిందని సూటిగా అడిగారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు. ఉక్కు పరిశ్రమ అడిగితే ఐటీ దాడులు అని చెప్పడం శోచనీయమన్నారు. నాలుగేళుల​ బీజేపీతో కలిసి ఉన్నప్పుడు ఉక్కుపరిశ్రమ గుర్తుకు రాలేదా అని సూటిగా ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక వీటి అన్నింటిపైన విచారణ చేస్తామని చెప్పారు. చంద్రబాబు బినామీలపై లోతుగా విచారణ జరిపించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తుందని అన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement