చంద్రబాబు చుట్టూ శిఖండులు..! | YSRCP Leader Meruga Nagarjuna Fires on Chandrababu | Sakshi
Sakshi News home page

Nov 5 2018 3:45 PM | Updated on Nov 5 2018 4:47 PM

YSRCP Leader Meruga Nagarjuna Fires on Chandrababu - Sakshi

సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో దళిత సంక్షేమానికి చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడిచిందని, దళితుల అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికొదిలేసిందని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున విమర్శించారు. జన్మభూమి కమిటీల పేరుతో నిబంధనలు ఉల్లంఘించి.. కోట్ల రూపాయల ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను ప్రభుత్వం దారి మళ్లించిందని మండిపడ్డారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం మేరుగ నాగార్జున విలేకరులతో మాట్లాడారు.

చంద్రబాబు తన చుట్టూ కొందరు శిఖండులను పెట్టుకుని పాలిస్తున్నారని, రాజ్యాంగబద్ధంగా సబ్‌ప్లాన్ నిధులు దళితులకే రావాలని అన్నారు. చంద్రబాబు కుయుక్తులను దళితులెవరూ నమ్మరాదని, వైఎస్‌ జగన్ సీఎం అయితేనే దళితుల జీవితాల్లో వెలుగులు వస్తాయని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement