వైఎస్సార్‌సీపీ ప్రభంజనం కొనసాగుతుంది.. 

Vijayawada Durga Temple Chairman Paila Sominaidu Comments On Chandrababu - Sakshi

దుర్గగుడి చైర్మన్‌ పైలా సోమినాయుడు

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం కొనసాగుతుందని దుర్గగుడి చైర్మన్‌ పైలా సోమినాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి మరోసారి ప్రజలు పట్టం కడతారని పేర్కొన్నారు. టీడీపీకి మరోమారు చెంపదెబ్బ తప్పదని విమర్శించారు. ఈ ఎన్నికల తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీలు కనుమరుగవడం ఖాయమన్నారు. 58 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేసిన పార్టీ వైఎస్సార్‌సీపీ మాత్రమేనని  చెప్పారు. (అభ్యర్థులు లేకే చంద్రబాబు డ్రామాలు)

బాబుకు బీసీలు బుద్ధి చెబుతారు..
బీసీలకు అన్యాయం చేయడానికే ప్రతిపక్ష నేత చంద్రబాబు కోర్టుకు వెళ్లారని.. ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెబుతారన్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ను విమర్శించే అర్హత మాజీ మంత్రి దేవినేని ఉమాకు లేదని దుయ్యబట్టారు. అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. టీడీపీ నేతలు గుండాయిజం మానుకోవాలని సోమినాయుడు హితవు పలికారు. (టీడీపీకి హైకోర్టులో చుక్కెదురు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top