
సాక్షి, తిరుమల: ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు పాలనలో అనేక అవినీతి కుంభకోణాలు జరిగాయని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు విషయంలో అనవసరంగా కులం ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు పేరుకే బీసీ, ఆయన జీవన విధానం అగ్రవర్ణాలకంటే ఎక్కువగా ఉంటుందన్నారు. అచ్చెన్న నిజాయితీపరుడైతే విచారణకు ధైర్యంగా సహకరించేవారని అన్నారు. (పెద్ద, చిట్టి నాయుళ్లు గుండెలు బాదుకోకండి)
ఎవ్వరినీ అణచి వేయాల్సిన అవసరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లేదని మోపిదేవి స్పష్టం చేశారు. బీసీలను వాడుకుంది టీడీపీ అని దుయ్యబట్టారు. బీసీలకు టీడీపీ ఏం చేసిందో చంద్రబాబు చెప్పాలని నిలదీశారు. బీసీల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌పై బురద చల్లడం మానుకోవాలని హితవు పలికారు. ఏడాది కాలంలో ఉత్తమ సీఎంల జాబితాలో చోటు దక్కిచుకోవడం సీఎం వైఎస్ జగన్ పరిపాలనకు నిదర్శనం అని మోపిదేవి గుర్తుచేశారు. (విపక్షం ఈర్ష్యతో బురద జల్లుతోంది)