నిరూపిస్తే రాజీనామా చేస్తా: మంత్రి అవంతి | Minister Avanthi Srinivas Comments On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

నిరూపిస్తే రాజీనామా చేస్తా: మంత్రి అవంతి

Oct 31 2019 7:52 PM | Updated on Oct 31 2019 8:39 PM

Minister Avanthi Srinivas Comments On Pawan Kalyan - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఇసుక అక్రమాలు జరిగినట్టు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ సవాల్‌ విసిరారు. గురువారం ఆయన విశాఖపట్నంలో ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇసుక అక్రమాల్లో వైఎస్సార్‌సీపీ నాయకుల హస్తం ఉందని నిరూపిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో ఇసుక అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని చెప్పిన చంద్రబాబు.. అదే నాయకులకు ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారని విమర్శించారు. రాజధాని పేరిట సింగపూర్‌ కంపెనీకి కోట్ల విలువైన భూమి ధారాదత్తం చేశారని ఆరోపించారు.

జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలని.. చంద్రబాబుపై అభిమానం ఉంటే పార్టీని టీడీపీలోకి విలీనం చేయాలన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు ఓడినా నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని.. గెలిచిన టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు నియోజకవర్గంలో కనిపించడం లేదని విమర్శించారు. ఓడిన తర్వాత పవన్‌క ల్యాణ్‌ గాజువాకలో కనిపించలేదని మంత్రి ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement