‘పదవి పోయాక బీసీలపై చంద్రబాబు కపట ప్రేమ’ | Kolusu Parthasarathy Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

‘పదవి పోయాక బీసీలపై చంద్రబాబు కపట ప్రేమ’

May 30 2020 5:38 AM | Updated on May 30 2020 5:38 AM

Kolusu Parthasarathy Comments On Chandrababu - Sakshi

సాక్షి,అమరావతి: తోకలు కత్తిరిస్తా, తాట తీస్తా అని బలహీన వర్గాలను కించపరిచిన చంద్రబాబు ఇప్పుడు అదే వర్గాలపై మహానాడు వేదికగా మొసలి కన్నీరు కారుస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి విమర్శించారు. అధికారం కోల్పోయాక ఈ వర్గాలపై కపట ప్రేమ చూపిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

బలహీనవర్గాల ప్రజలు తమ న్యాయమైన హక్కుల కోసం చంద్రబాబు దగ్గరకు వెళ్తే వారిని అవమానించే రీతిలో ప్రవర్తించారని మండిపడ్డారు.  అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు రూ. 50 వేల కోట్లు ఖర్చు చేస్తానని చెప్పి కనీసం రూ.5 వేల కోట్లు కూడా చంద్రబాబు ఖర్చు చేయలేదని చెప్పారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు బీసీల గురించి మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement