‘మోదీ హత్యకు గడ్కరీ స్కెచ్‌’

JNU Shehla Rashid Alleges Gadkari planning to kill Modi - Sakshi

దుమారం రేపిన విద్యార్థి సంఘం నేత పోస్ట్‌

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్కెచ్‌ వేశారంటూ ఓ విద్యార్థి నేత చేసిన ట్వీట్‌ తీవ్ర దుమారం రేపింది. జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) విద్యార్థిని, ఉద్యమకారిణి అయిన షెహ్లా రషీద్‌ శనివారం తన ట్విటర్‌ ఖాతాలో ఓ వివాదాస్పద పోస్టును ఉంచారు.  (రాజీవ్‌ తరహాలోనే మోదీ హత్యకు భారీ కుట్ర!)

‘పరిస్థితులు చూస్తుంటే మోదీని హత్య చేసేందుకు ఆరెస్సెస్‌/గడ్కరీ ప్రణాళిక వేశారనిపిస్తోంది. ఆపై ముస్లింలను, కమ్యూనిస్టులపై ఆ అభాండం నెట్టేసి వారిని కూడా ఊచకోత కోస్తారేమో!.. #RajivGandhiStyle’ అంటూ ఆమె ఓ ట్వీట్‌ను ఉంచారు. ఈ ట్వీట్‌ను పలువురు రీట్వీట్‌ చేయగా, అది కాస్త వైరల్‌ అయ్యింది.

గడ్కరీ ఘాటు రిప్లై:  షెహ్లా రషీద్‌ను ప్రస్తావించకుండా సదరు పోస్టుపై నితిన్‌ గడ్కరీ ఘాటుగా స్పందించారు. ‘ఇలా వికృతమైన వ్యాఖ్యలతో చెలరేగే ఆరాచక శక్తులను ఉపేక్షిస్తే మంచిది కాదు. వారిపై న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్నా’ అంటూ ఆయన హెచ్చరించారు. అయితే రషీద్‌ కూడా తిరిగి అదే స్థాయిలో కౌంటర్‌ ఇచ్చే యత్నం చేశారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ నేతకు వ్యంగ్య పోస్టుకు స్పందించటం తెలుసు. కానీ, అమాయకుడైన ఓ విద్యార్థి ఉమర్‌ ఖలీద్‌పై తప్పుడు కథనాలతో  ఇబ్బందులకు గురి చేస్తున్న మీడియా ఛానెల్‌ గురించి తెలీదా? ఆ ఛానెల్‌ జర్నలిస్టుపై మీరు చర్యలు తీసుకోగలరా?’ అంటూ గడ్కరీకి షెహ్లా సవాల్‌ విసిరారు.

పోలీసులకు ఖలీద్‌ ఫిర్యాదు... కాగా, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ) విద్యార్థి నేత ఉమర్ ఖలీద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ రవి పుజారి నుంచి తనకు ఈ బెదిరింపులు వస్తున్నాయని, తనకు పోలీసు రక్షణ కల్పించాలని ఉమర్ ఖలీద్ ఆ ఫిర్యాదులో పోలీసులను కోరారు. 'రవి పుజారి నుంచి జిగ్నేష్‌కూ, నాకూ చంపుతామనే బెదిరింపులు వస్తున్నాయి. దీనిపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాను. తన హిట్ ‌లిస్ట్‌లో నేను ఉన్నట్టు రవి పూజారి చెప్పాడు. ఇదే వ్యక్తి (పుజారి) 2006 ఫిబ్రవరిలో కూడా నన్ను ఇలాగే బెదిరించాడు' అని ఖలీద్ ఓ ట్వీట్‌ చేశాడు. 

(పాపులారిటీ కోసమే మోదీ హత్య వార్త)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top