దొంగలను అరెస్ట్‌ చేయొద్దా? | Botsa Satyanarayana Comments On TDP Leaders | Sakshi
Sakshi News home page

దొంగలను అరెస్ట్‌ చేయొద్దా?

Jun 18 2020 4:19 AM | Updated on Jun 18 2020 4:19 AM

Botsa Satyanarayana Comments On TDP Leaders - Sakshi

సాక్షి, అమరావతి: దొంగలను అరెస్టు చేయకుండా.. దండలు వేసి ఊరేగించాలా అంటూ టీడీపీ సభ్యులపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్‌పై శాసన మండలిలో బుధవారం చర్చ జరుగుతుండగా.. టీడీపీ సభ్యుడు రాజేంద్రప్రసాద్‌ కలుగజేసుకొని తమ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. దీంతో మంత్రి బొత్స స్పందిస్తూ.. ‘ఈఎస్‌ఐలో జరిగిన కుంభకోణంలో అచ్చెన్నాయుడే ప్రధాన పాత్రధారుడనే విషయం ఏసీబీ దర్యాప్తులో తేలింది. అలాగే జేసీ ప్రభాకర్‌రెడ్డిని కూడా అక్రమాలకు పాల్పడినందునే అరెస్టు చేశారు’ అని వివరించారు. ఫైబర్‌ గ్రిడ్‌లో ఏం జరిగిందో.. వాటి స్కామ్‌లకు సంబంధించిన అవినీతిని కూడా బయటకు తీస్తామని చెప్పారు. అవినీతిపరులపై ప్రభుత్వం విచారణ చేయకుండా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. చంద్రబాబుకు ధైర్యముంటే టీడీపీ హయాంలో అవినీతి జరగలేదని సభలో చెప్పాలంటూ సవాల్‌ విసిరారు. 

Advertisement
 
Advertisement
Advertisement