తండ్రి, కొడుకులు ఇద్దరూ నరుకుడే: బాబుమోహన్‌ | BJP Leader Babu Mohan Slams KCR | Sakshi
Sakshi News home page

Oct 14 2018 9:21 PM | Updated on Oct 14 2018 9:21 PM

BJP Leader Babu Mohan Slams KCR - Sakshi

సాక్షి, సంగారెడ్డి : కేటీఆర్‌ను అర్జెంట్‌గా ముఖ్యమంత్రిని చెద్దామను కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వచ్చారని బీజేపీ నేత బాబుమోహన్‌ ఆరోపించారు. సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ సమరభేరి సభలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బాబూ మోహన్ మాట్లాడుతూ..‘తెలంగాణ వచ్చిందని చాలా ఆనంద పడ్డాను. తెలంగాణ ప్రజలకు విలువ, గౌరవం వచ్చిందనుకున్నాను. కేసీఆర్ పాలన అహో.. ఓహో అనుకున్నా కానీ తండ్రి కొడుకులు ఇద్దరూ నరుకుడే. నీళ్లు ఇవ్వకుముందే ఓట్లు అడుగుతున్నారు. వద్దంటే నన్ను రాజకీయాల్లోకి తెచ్చారు. దళితున్ని సీఎం చేస్తానని మోసగించారు. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కుటుంబం కోసమా? బీజేపీ దళితులను గౌరవించే పార్టీ కాబట్టే బీజేపీలో చేరాను. దళితులను రాష్ట్రపతి చేసిన పార్టీ బీజేపీ. మోదీ ఒక్క పైసా అప్పు తేలేదు. తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల కోట్లు అప్పులయ్యాయి. ప్రస్తుత సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పొద్దున లేస్తే మంత్రి హరీశ్ ఇంటి గేట్ దగ్గరే ఉంటారు. ఇటువంటి వ్యక్తిని గెలిపించ వద్దు.’’ అని అన్నారు. 

ముందస్తుకు ఎందుకు వెళ్లారు : సదానంద గౌడ
జమిలి ఎన్నికలకు కాకుండా ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లారో కేసీఆర్‌ ప్రజలకు చెప్పాలని కేంద్ర మంత్రి సదానండ గౌడ డిమాండ్‌ చేశారు. బీజేపీ సమరభేరిలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో సచివాలయానికి వెళ్లని ఏకైక సీఎం కేసీఆర్‌యేనని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కేసీఆర్ అధికారం లోకి వస్తే ఇక్కడి ప్రజలకు న్యాయం జరుగుతుందనుకుంటే కేవలం ఆయన కుటుంబం మాత్రమే బాగుపడిందని విమర్శించారు. రెండు రాష్ట్రాలకు ఎంతో సహకరిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement