‘బాల్క సుమన్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలి’ | Balka suman should suspended from party | Sakshi
Sakshi News home page

‘బాల్క సుమన్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలి’

Jul 7 2018 2:34 AM | Updated on Mar 18 2019 9:02 PM

Balka suman should suspended from party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ను టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి వెంటనే సస్పెండ్‌ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధులు గజ్జెల కాంతం, ఇందిరాశోభన్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో గజ్జెల కాంతం మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాకు చెందిన సంధ్య, విజేత అనే మహిళలను శారీరకంగా లోబర్చుకున్నారని బాల్క సుమన్‌పై కేసు నమోదైందన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి వెంటనే ఆయనను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement