మోదీ ట్వీట్‌.. కేజ్రీవాల్‌ రిప్లై | Arvind Kejriwal Reply To Narendra Modi | Sakshi
Sakshi News home page

మోదీ ట్వీట్‌.. కేజ్రీవాల్‌ రిప్లై

Feb 11 2020 8:37 PM | Updated on Feb 11 2020 8:48 PM

Arvind Kejriwal Reply To Narendra Modi - Sakshi

ప్రధాని మోదీతో కేజ్రీవాల్‌(ఫైల్‌ ఫొటో)

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ మరోసారి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్‌ చేశారు. ‘ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆప్‌కు, అరవింద్‌ కేజ్రీవాల్‌కు కంగ్రాట్స్‌. ఢిల్లీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను’ అని పేర్కొన్నారు. 

అయితే మోదీ ట్వీట్‌పై కేజ్రీవాల్‌ వెంటనే స్పందించారు. ‘థాంక్యూ సో మచ్‌ సార్‌. న్యూఢిల్లీని వరల్డ్ క్లాస్ సిటీగా తీర్చిదిద్దేందుకు కేంద్రంతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాను’ అని బదులిచ్చారు. కాగా, నేడు వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్‌ 62 సీట్లు కైవసం చేసుకోగా, బీజేపీ 8 స్థానాలతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్‌ పార్టీ ఖాతా కూడా తెరువలేదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ గెలుపును ఢిల్లీ ప్రజల విజయంగా కేజ్రీవాల్‌ అభివర్ణించారు.

చదవండి : ఢిల్లీ ప్రజలు సరికొత్త తీర్పు ఇచ్చారు : కేజ్రీవాల్‌

ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ప్రకాశ్‌ రాజ్‌ ట్వీట్‌

Advertisement
 
Advertisement
Advertisement