ముస్లింకా దుష్మన్‌ చంద్రబాబు

Anantha venkata Rami Reddy Slams Chandrababu Naidu - Sakshi

 వైఎస్‌ జగన్‌ వస్తేనే ముస్లింల జీవితాల్లో వెలుగు

ముస్లింలలో జేసీ సోదరులు చిచ్చుపెడుతున్నారు

ముస్లిం మైనార్టీ ఆత్మీయ సదస్సులో మాజీ ఎంపీ అనంత

అనంతపురం, తాడిపత్రి: ‘‘ముసల్మాన్‌కా దుష్మన్‌ చంద్రబాబు....నారా నమక్‌ హరాం’’ అని వైఎస్సార్‌ సీపీ అనంతపురం పార్లమెంటు అధ్యక్షుడు, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం పట్టణంలోని సత్యసాయి ఫంక్షన్‌ హాలులో వైఎస్సార్‌ సీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు గయాజ్‌బాషా ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా వైఎస్సార్‌ సీపీ మైనార్టీ విభాగం జాతీయ కార్యదర్శి రెహ్మాన్, విజయవాడ పార్లమెంటు సమన్వకర్త మహ్మద్‌ ఇక్బాల్, కడప శాసనసభ్యులు అంజాద్‌బాషా, హిందూపురం పార్లమెంటు సమన్వయకర్త నదీమ్‌ అహ్మద్, తాడిపత్రి సమన్వకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి తదితరులు ముఖ్యతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనంత వెంకట్రామిరెడ్డి, మాట్లాడుతూ, మహానేత వైఎస్సార్‌ హయాంలో బడుగుబలహీన వర్గాలన్నీ బాగుపడ్డాయనీ, మళ్లీ అలాంటి పరిపాలన తిరిగి రావాలంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో తిరిగి రాజన్న రాజ్యం వస్తుందన్నారు. తాడిపత్రి నుంచి రాజధాని వరకు ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీని, రాష్ట్రంలో ఉన్న టీడీపీని ఇంటికి సాగనంపడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గమనించారనీ, వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించే ప్రతిపక్ష నేతపై హత్యకు కుట్ర పన్నాడని అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. సొంత మామనే వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుకు దక్కిందన్నారు. ఆయన జీవితమంతా కుట్రమలమయమన్నారు.

చంద్రబాబు అధికారం కోసం ఎన్ని రంగులైనా మారుస్తారనీ, అందువల్లే తిట్టిన నోటితోనే సోనియాగాంధీని ఆకాశానికి ఎత్తుతున్నాడన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో జతకట్టి నాలుగేళ్లు కేంద్రంలో అధికారం పంచుకున్న చంద్రబాబు....అతని అవినీతిని ప్రశ్నించినందుకు బీజేపీ నుంచి వైదొలిగి కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నాడని అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు సొంతంగా ఏనాడు అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవని... పొత్తులతోనే అధికారాన్ని చేజిక్కించుకుంటున్నాడన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్‌బాషా, మైనార్టీ విభాగం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎంఎస్‌ బేగ్,  పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కొనుదుల రమేష్‌రెడ్డి, పైలా నరసింహయ్య, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి పేరం స్వర్ణలత, మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి రియాజ్, పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి షబ్బీర్, సేవాదళ్‌ పట్టణ అధ్యక్షుడు హాజీవలి, మైనార్టీ సెల్‌ పట్టణ అధ్యక్షుడు అన్వర్‌బాషా, మైనార్టీ విభాగం జిల్లా  ప్రధాన కార్యదర్శి పెయింటర్‌బాషా, జిల్లా ప్రచార కార్యదర్శి షేక్‌గౌస్, ఖాజాపీర్, గౌస్‌పీర్, యువజన విభాగం జిల్లా కార్యదర్శులు ఎస్‌.బాబా, జబ్బార్, హనుమంతరెడ్డి, ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి రంగనాథ్‌రెడ్డి, యాడికి మండల కన్వీనర్‌ బొంబాయి రమేష్‌నాయుడు, జెడ్పీటీసీ సభ్యుడు వెంకట్రామిరెడ్డి,  రైతు విభాగం జిల్లా కార్యదర్శి వెంకట్రామిరెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, సాంస్కృతిక విభాగం జిల్లా కార్యదర్శి రమేష్‌నాయుడు, సేవాదళ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్‌కుమార్, ఎస్సీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలరాజు, బీసీ సెల్‌ కార్యదర్శి లక్ష్మీరంగయ్య, ఎస్సీ సెల్‌ పట్టణ కన్వీనర్‌ దూలా రఘు తదితరులు పాల్గొన్నారు.  

వైఎస్సార్‌ వల్లే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు  
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చలువ వల్లే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు దక్కాయి. ఆయన పాలనలో ముస్లింలకు ఏ కొరతా లేకుండా చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేద ముస్లింలకు ఎన్నో ఆపరేషన్లు చేయించారు. వైఎస్సార్‌ వల్లే ముస్లింల ఆర్థిక స్థితిగతులు మారాయి. మళ్లీ అలాంటి సువర్ణయుగం రావాలంటే వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాల్సి అవసరం ఉంది.               – నదీమ్‌ అహ్మద్, హిందూపురం పార్లమెంట్‌ సమన్వయకర్త

జేసీ సోదరుల దోపిడీకి అంతేలేదు
జేసీ సోదరుల దోపిడీకి అంతులేకుండా పోయింది. వారి దోపిడీని ప్రశ్నించిన వారిపై దాడులకు దిగుతున్నారు. వారి పుణ్యాన లారీ ఓనర్లు అప్పులపాలవుతున్నారు. ముస్లింల ఆర్థిక పరిస్థితులను ఆసరాగా చేసుకున్న జేసీ సోదరులు... వారిని అసాంఘిక కార్యకలాపాలవైపు ప్రోత్సహిస్తున్నారు. ముస్లింల మధ్య చిచ్చుపెడుతున్నారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి పేద ముస్లింకు పక్కా ఇల్లు నిర్మించి ఇస్తాం.  – కేతిరెడ్డి పెద్దారెడ్డి, సమన్వయకర్త, తాడిపత్రి

ముస్లింలకు పెద్దపీట
మహానేత డాక్టర్‌ వైఎస్సార్‌ తన హయాంలో ముస్లిం సంక్షేమానికి పె ద్దపీట వేశారు. చంద్రబాబు నా యుడు ముస్లింలకు తీరని ద్రోహం చేయడమే కాకుండా కులాల మధ్య  చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. చంద్రబాబు ముస్లింలకు ఏనాడు అధికారం ఇవ్వలేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓట్ల కోసం ముస్లింలను మంత్రివర్గంలోకి తీసుకున్నాడు.  – అంజాద్‌బాషా, శాసనసభ్యులు, కడప

వక్ఫ్‌బోర్డు ఆస్తులుఅన్యాక్రాంతం
తాడిపత్రిలోని వక్ఫ్‌బోర్డు ఆస్తులన్నీ అన్యాక్రాంతమవుతున్నాయి. పేరు కే వక్ఫ్‌బోర్డు కమిటీలో ముస్లింలు ఉన్నారు. కానీ పెత్తనం అంతా ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిదే. వక్ఫ్‌బోర్డుకు చెందిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ బాడుగలు రూ.లక్షల్లో వస్తుంటే...ఎమ్మెల్యే జేసీపీఆర్‌ రూ.వేలల్లో చూపించి స్వాహా చేస్తున్నారు. వక్ఫ్‌బోర్డు ఆస్తుల అన్యాక్రాంతంపై ప్రశ్నించినందుకే జేసీ సోదరులు నాపై దాడి చేశారు. అయినా నేను ఎవరికీ భయపడను. వక్ఫ్‌బోర్డు ఆస్తుల పరిరక్షణ కోసం ప్రాణాలైనా అర్పిస్తాను.  – గయాజ్‌బాషా, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top