ఆస్ట్రేలియా లిబరల్ పార్టీ  వైస్ ప్రెసిడెంట్ నోట జై జగన్!

YSRCP NRI Leaders Meets Vice President Of Victoria Liberal Party Paul Mitchell - Sakshi

మెల్‌బోర్న్‌ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్థంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ ప్రవాస భారతీయ కార్యకర్తలు విక్టోరియా లిబరల్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ పౌల్ మిచెల్ ను కలిశారు. ఈ సందర్భంగా మహానేత వైఎస్సార్‌ వర్థంతి కార్యక్రమాల గురించి, ఆంధ్రప్రదేశ్ లో ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ- అభివృద్ధి పథకాల గురించి వివరించారు.

అలానే  వైస్సార్‌ ఆశయాలు, ఆశలకు అనుగుణంగా.. ఆయన నడిచిన బాటే.. ఆదర్శంగా  ఆవిర్భవించి ఏడేళ్ళలోనే ఆంధ్రప్రదేశ్ లో ఓ జన ప్రభంజనంలా దూసుకుపోతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ విశిష్టతను, పార్టీ అధినేత వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి  పోరాట పటిమ, ఆయన ప్రస్తుతం చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర విశేషాలను వివరించారు. దాంతో విక్టోరియా లిబరల్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ పౌల్ మిచెల్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన వేసుకోవడమే కాకుండా.. జై జగన్..  జై వైఎస్సార్‌సీపీ.. అంటూ నినదించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top