‘అత్తింటి’ బాధితురాలు ఎక్కడినుంచైనా ఫిర్యాదు

Woman Driven Out Of Matrimonial Home Can File Case At Place Of Shelter - Sakshi

న్యూఢిల్లీ: వివాహ సంబంధ కేసులు, అత్తింట్లో వేధింపులతో బయటకు వచ్చిన/గెంటివేతకు గురైన మహిళలు తాము ఆశ్రయం పొందుతున్న చోట నుంచి సైతం అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. బాధితురాలు తన మెట్టినిల్లు ఏ కోర్టు పరిధిలో ఉందో అక్కడే ఫిర్యాదు చేయాలని, చట్టప్రకారం వేరే చోటు నుంచి చేసి ఫిర్యాదుపై దర్యాప్తు జరిపించడం, శిక్షలు విధించడం కుదరదంటూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రుపాలీదేవీ అనే బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అత్తింటి నుంచి వెలుపలికి వచ్చి ఆశ్రయం పొందుతున్న మహిళల ఫిర్యాదులను న్యాయస్థానాలు వాస్తవ పరిస్థితలను పరిగణించి ఐపీసీ 498ఏ కింద విచారణ చేపట్టవచ్చునని స్పష్టతనిచ్చింది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top