ముందస్తు ప్రచారం నిబంధనలకు విరుద్ధం | Vice-President Venkaiah Naidu likely to take time to act on motion | Sakshi
Sakshi News home page

ముందస్తు ప్రచారం నిబంధనలకు విరుద్ధం

Apr 22 2018 1:44 AM | Updated on Sep 2 2018 5:48 PM

Vice-President Venkaiah Naidu likely to take time to act on motion - Sakshi

న్యూఢిల్లీ: రాజ్యసభాధ్యక్షుడికి అందజేసిన నోటీసులోని విషయాలకు ముందస్తు ప్రచారం ఇవ్వడం నిబంధనల ఉల్లంఘనే అవుతుందని పార్లమెంట్‌ అధికారులు తెలిపారు. ప్రతిపక్షాలు సీజేఐ జస్టిస్‌ మిశ్రాపై పలు ఆరోపణలు చేస్తూ అభిశంసన తీర్మానం నోటీసులను రాజ్యసభాధ్యక్షుడు వెంకయ్యకి అందజేయడం తెల్సిందే.

ఈ నోటీసులోని వివరాలన్నీ శనివారం మీడియాలో రావటంపై అధికారులు స్పందించారు. సభలో ప్రస్తావించదలచిన నోటీసు చైర్మన్‌ అంగీకారం పొంది, దాని ప్రతులను సభ్యులకు పంపిణీ చేసేవరకు ఎవరూ దానిని వెల్లడి చేయరాదని పార్లమెంటరీ విధివిధానాలు చెబుతున్నాయన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement