ఇది కేంద్రం ఘనత కాదు : ఉద్ధవ్‌ | Uddhav Thackeray Says Centre Cant Take Credit For Ayodhya Verdict | Sakshi
Sakshi News home page

ఇది కేంద్రం ఘనత కాదు : ఉద్ధవ్‌

Nov 9 2019 12:17 PM | Updated on Nov 9 2019 3:21 PM

Uddhav Thackeray Says Centre Cant Take Credit For Ayodhya Verdict - Sakshi

అయోధ్యపై సుప్రీం కోర్టు తీర్పును కేంద్రం తన ఘనతగా చెప్పుకోలేదని శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు.

ముంబై : అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పును కేంద్ర ప్రభుత్వం తన ఘనతగా చాటుకోలేదని శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. అయోధ్యలో వివాదాస్పద స్థలాన్ని మందిర నిర్మాణానికి ఏర్పాటు చేసే ట్రస్ట్‌కు అప్పగించాలని, మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి చట్టం చేయాలని తాము ప్రభుత్వాన్ని కోరితే అందుకు నిరాకరించిందని, సుప్రీం తాజా తీర్పును ప్రభుత్వం ఇప్పుడు తమ ఘనతగా చెప్పుకోరాదని ఠాక్రే ఆక్షేపించారు. కాగా, మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, శివసేనల మధ్య తీవ్ర విభేదాలతో ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. సీఎం పదవిని చెరి రెండున్నరేళ్లు పంచుకోవాలన్న సేన ప్రతిపాదనను బీజేపీ వ్యతిరేకిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement