కాంగ్రెస్ నాయకత్వంలో మార్పు ఉండదు | There is a no change in the leadership of the Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ నాయకత్వంలో మార్పు ఉండదు

Nov 3 2014 12:27 AM | Updated on Mar 18 2019 7:55 PM

కాంగ్రెస్ నాయకత్వంలో మార్పు ఉండదు - Sakshi

కాంగ్రెస్ నాయకత్వంలో మార్పు ఉండదు

కాంగ్రెస్ పార్టీకి గెలుపోటములు సహజమేనని, అధినాయత్వంలో ఎలాంటి మార్పు ఉండబోదని కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్ షిండే స్పష్టం చేశారు.

కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్ షిండే

సాక్షి, తిరుమల: కాంగ్రెస్ పార్టీకి గెలుపోటములు సహజమేనని, అధినాయత్వంలో ఎలాంటి మార్పు ఉండబోదని కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్ షిండే స్పష్టం చేశారు. ఆదివారం కుటుంబ సభ్యులతో కలసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ నేతృత్వంలో పార్టీ పునర్జీవం సాగిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పాటైన  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తాత్కాలిక ఇబ్బందులు ఉన్నా తర్వాత  సమసిపోతాయని చెప్పారు. తమ నాయకత్వంలో ఏర్పాటైన రెండు రాష్ట్రాల్లోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించానన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement