పోటీ చేస్తాననుకుంటున్నారా చేయననుకుంటున్నారా

TDP and NCP are upholding Priyanka contribution to Narendra Modi - Sakshi

వారణాసిలో ప్రియాంక పోటీపై ఊహాగానాలు​​​​​

ఇంకా అభ్యర్థిని ప్రకటించని కాంగ్రెస్‌ 

మోదీ బరిలో ఉన్న స్థానం కావడంతో సర్వత్రా ఆసక్తి

కాశీలో రంగులు మారుతున్న రాజకీయం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండోసారి బరిలో దిగుతున్న వారణాసిలో ‘హర హర మోదీ, ఘర్‌ ఘర్‌ మోదీ’ నినాదాలు మిన్నంటుతున్నాయి. మోదీ ఐదేళ్ల పాలనపై వ్యతిరేకత ఉన్న జడ్జీల నుంచి జవాన్ల వరకు సామాన్యులెందరో ఇక్కడ బరిలో దిగి ఆయనకి సవాల్‌ విసురుతున్నారు. వాళ్లతో ప్రధానికి వచ్చే ఇబ్బందేమీ లేదు కానీ ఇప్పుడు ప్రియాంక గాంధీ వాద్రా వారణాసి నుంచి పోటీకి దిగుతారని జరుగుతోన్న చర్చ రాజకీయాలను వేడెక్కిస్తోంది. 2014 ఎన్నికల్లో మోదీపై పోటీ చేసి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఓడిపోయినప్పటికీ ప్రచారం వరకు బీజేపీని ఇరుకున పెట్టడంలో విజయం సాధించారు. ఈసారి ప్రియాంక పోటీచేస్తే మోదీని ఎదుర్కొనే బలమైన అభ్యర్థిగా నిలుస్తారనడంలో సందేహం లేదు. వారణాసి నుంచి కాంగ్రెస్‌ తరఫున ఎవరు బరిలోకి దిగుతారన్న దానిపై ఇంకా స్పష్టత లేదు.

కాంగ్రెస్‌ విడుదల చేసిన అభ్యర్థుల తాజా జాబితాలో కూడా వారణాసి నియోజకవర్గం అభ్యర్థి పేరు ప్రస్తావించలేదు. దీంతో బరిలో ప్రియాంక దిగుతారేమోనన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనిపై కాంగ్రెస్‌ నాయకులు ఎవరూ నోరు మెదపటం లేదు. పార్టీ తుది నిర్ణయం తీసుకుంటే తామే ప్రకటిస్తామంటూ   కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా ఈ విషయాన్ని దాటవేశారు. అలహాబాద్, వారణాసిల్లో తమకున్న బలంపై కాంగ్రెస్‌ పలు అంతర్గత సర్వేలు నిర్వహించింది గానీ ఎలాంటి ఫలితాలు వచ్చాయో వెల్లడించలేదు. ఈ ఏడాదే తూర్పు ఉత్తరప్రదేశ్‌ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గత ఎన్నికల్లోనూ ప్రధానిపై పోటీకి ఉత్సాహం కనబరిచారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

పార్టీలో తలోమాట
వారణాసిలో ప్రియాంక అభ్యర్థిత్వంపై కాంగ్రెప్‌ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానిపై పోటీ చేయగల సామర్థ్యం, కరిష్మా ఆమెకే ఉందని కొందరు అభిమానులు అంటుంటే, మరికొందరు గత ఎన్నికల్లో అరవింద్‌ కేజ్రీవాల్‌కు పట్టిన గతే ఆమెకీ పడుతుందని చెవులు కొరుక్కుంటున్నారు. తొలి ప్రయత్నంలోనే ఓటమి పరాభవం కొని తెచ్చుకోవటం సరికాదని కొందరు పెద్దలు సలహా ఇస్తున్నారు. మరి కొందరు ప్రియాంక రాకతో మోదీ వారణాసికి ఎక్కువ సమయం కేటాయించి, మిగిలిన ప్రాంతాలకు వెళ్లరని అది కచ్చితంగా బీజేపీని దెబ్బతీయడమేననే వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పటికే ప్రియాంక పోటీకి తన అంగీకారాన్ని తెలిపారని, ఆమె అన్న, పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీదే తుది నిర్ణయమని పార్టీలో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ మిత్రపక్షమైన టీడీపీ, ఎన్‌సీపీ లాంటి పార్టీలు ఇప్పటికే ప్రియాంక వారణాసి అభ్యర్థిత్వంపై మద్దతు ప్రకటించాయి. 

ప్రత్యర్థి,కూటమి పార్టీలు ఏమంటున్నాయి?
నరేంద్రమోదీపై ప్రియాంక పోటీ చేయడాన్ని టీడీపీ, ఎన్‌సీపీ సమర్థిస్తున్నాయి. అయితే మహాగఠ్‌ బంధన్‌ భాగస్వామ్య పార్టీలైన సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీలు స్థానికంగా బలమైనవి. వారణాసి నుంచి తాము పోటీ చేయబోమని ఈ పార్టీలు హామీ ఇస్తే గానీ ప్రియాంకని కాంగ్రెస్‌ ఇక్కడ పోటీకి దింపకపోవచ్చు. వారణాసిలో సమాజ్‌వాదీ పార్టీ పోటీ చేసే అవకాశం లేకపోలేదు. అయితే ఈ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్, ప్రియాంక 2017 నుంచి కలిసి పని చేస్తున్నారు. గెలుపుతో పాటు ఓట్లు రాబట్టడానికి కూడా ఆమె పోటీ ఉపయోగపడాలని కాంగ్రెస్‌ ఆశిస్తోంది. 

ఎస్పీ, బీఎస్పీభయపడుతున్నాయా?
ఎస్పీ, బీఎస్పీ.. కాంగ్రెస్‌ను తమ కూటమిలో చేర్చుకోలేదు. 2017లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి జ్ఞాపకాలు ఇంకా తాజాగా ఉన్న నేపథ్యంలో, రాహుల్, సోనియా పోటీ చేస్తున్న అమేథీ, రాయ్‌బరేలీల్లో అభ్యర్థులను నిలపకూడదని ఎస్పీ, బీఎస్పీ కూటమి నిర్ణయించింది. యూపీ రాజకీయాల్లో ప్రియాంక ప్రవేశం, ముఖ్యంగా మోదీపై పోటీలో ఆమెను సమర్థిస్తే, తమ కూటమికే ఎదురుదెబ్బ తగులుతుందనే భావన వారిలో వ్యక్తమవుతోంది. 

తురుఫు ముక్కే ఓడిపోతే..? 
ఒకవేళ వారణాసిలో మోదీపై ప్రియాంక పోటీ చేసి ఓడిపోతే, 2014లో మోదీ చేతిలో ఓడిన ఆప్‌ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఎదురయిన కష్టాలే ఆమెకు తప్పకపోవచ్చని అంటున్నారు. ఓటమి తర్వాత కేజ్రీవాల్‌ ఢిల్లీ దాటి తన పార్టీని విస్తరించ లేకపోయారు. కాంగ్రెస్‌ పార్టీ తురుఫు ముక్కగా భావించే ప్రియాంక ఓడిపోతే ఇక కాంగ్రెస్‌ అమ్ముల పొదిలో ఆఖరి అస్త్రం మిగలకుండా పోతుంది. గత ఎన్నికలో పరాభవం నుంచి ఇంకా బయట పడలేకపోతున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రియాంక ఓడిపోతే మరింత డీలా పడిపోతుందనే ఆందోళనలైతే వ్యక్తమవుతున్నాయి. 

రాబర్ట్‌ వాద్రా ఫ్యాక్టర్‌
ప్రియాంక ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తలు రాగానే, తన భర్త ఆస్తులు కాపాడుకునేందుకే ఆమె రాజకీయాలకు వస్తున్నారని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ సెటైర్లు వేశారు. యూపీ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌గా బాధ్యత స్వీకరించిన రోజే ఆమె భర్త రాబర్ట్‌ ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ముందు హాజరయ్యారు. వెంటనే ఆయనపై కేసులు ప్రియాంకకు ఇబ్బంది కలిగించాయి. ప్రియాంక వారణాసిలో నామినేషన్‌ దాఖలు చేశాక, ఆమె ఆస్తుల వివరాలపై అందరి దృష్టి నిలుస్తుంది. ఇలాంటి అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుని ప్రియాంక పోటీపై రాహుల్‌ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. 

పార్టీ ప్రియాంక చేతుల్లోకి..
పోటీలో ప్రియాంకకు కలిసి వచ్చే అంశాలు చాలా ఉన్నాయి. ఇందిరా గాంధీ లాంటి రూపం అందులో ప్రధానమైంది. గతంలో ఎక్కడా పోటీ చేయకపోవటం, పార్టీ వర్గాల్లో రాహుల్‌ కన్నా ఆమె పార్టీ కార్యకర్తలతో చురుకుగా మాట్లాడడం అనుకూల అంశాలు. అయితే ఆమె పార్టీలో, ప్రజల్లో బలంగా దూసుకెళ్తే, సొంత పార్టీలో రాహుల్‌ పరిస్థితి ఏంటి? ప్రియాంక చేతుల్లోకే పార్టీ పవర్‌ అంతా వెళ్లిపోతే రాహుల్‌ గాంధీ తన నాశనం తాను కోరుకున్నట్లే అవుతుందా? ప్రియాంక ప్రధానికి వ్యతిరేకంగా పోటీ చేయటం అంటే, బీజేపీతో ప్రత్యక్ష పోరును ప్రకటిస్తున్నట్టేనా?.. ఇలాంటి చాలా అంశాలు రాహుల్‌ మెదడుని తొలిచేస్తూ ఉండవచ్చు. 

మరిన్ని వార్తలు

17-04-2019
Apr 17, 2019, 04:50 IST
సాక్షి, హైదరాబాద్‌: స్థానిక ఎన్నికల నేపథ్యంలో గతంలో లెక్కలు చూపని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఆశావహులకు చేదువార్త. గతంలో గ్రామ పంచాయతీ,...
17-04-2019
Apr 17, 2019, 04:41 IST
సత్తెనపల్లి (గుంటూరు): పోలింగ్‌ రోజున ఓట్లు వేయనివ్వకుండా స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని గుంటూరు జిల్లా...
17-04-2019
Apr 17, 2019, 04:21 IST
‘పోలింగ్‌ రోజు సీఎం చంద్రబాబునాయుడు మీ కార్యాలయానికి వచ్చి మిమ్మల్ని ఉద్దేశించి ఏమన్నారు? ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి ఏం మాట్లాడారు...?...
17-04-2019
Apr 17, 2019, 04:12 IST
సాక్షి,సిటీబ్యూరో: గత ఐదేళ్ల పాలనలో అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు సార్వత్రిక ఎన్నికలు ముగిశాక ఇప్పుడు...
17-04-2019
Apr 17, 2019, 04:07 IST
ఈవీఎంల పనితీరుపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న అధికార టీడీపీ కొందరు ఉన్నతాధికారుల సహకారంతో ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు వేసిన పథకం...
17-04-2019
Apr 17, 2019, 03:54 IST
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై వేటుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు...
17-04-2019
Apr 17, 2019, 03:40 IST
సాక్షి, గుంటూరు, రాజుపాలెం (సత్తెనపల్లి): ఎన్నికల సందర్భంగా ఈ నెల 11వ తేదీన సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి, స్పీకర్‌ కోడెల...
17-04-2019
Apr 17, 2019, 03:30 IST
తాను (చంద్రబాబు) గెలిస్తేనేమో అన్నీ బాగున్నట్లేనా? తాను ఓడిపోతే మాత్రం ప్రజలు ఓట్లేయలేదనే విషయాన్ని ఒప్పుకోకుండా ఈవీఎంల మీద నెపాన్ని...
17-04-2019
Apr 17, 2019, 03:22 IST
ఈసారి లోక్‌సభ బరిలో రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్య నేతలను అధిష్టానం బరిలో దింపింది కూడా ఇదే వ్యూహంతోనని పార్టీ వర్గాలు...
16-04-2019
Apr 16, 2019, 21:07 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పోలింగ్‌ బూత్‌లలో రీపోలింగ్‌ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికలు పంపారు....
16-04-2019
Apr 16, 2019, 20:24 IST
వెల్లూరు లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల రద్దుకు ఈసీ నిర్ణయం
16-04-2019
Apr 16, 2019, 19:45 IST
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడులోని ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకే) నాయకులు అవకాశం దొరికినప్పుడల్లా తాము హిందూ వ్యతిరేకులం కాదని,...
16-04-2019
Apr 16, 2019, 19:21 IST
సాక్షి, గుంటూరు : రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ నాయకుడు కోడెల శివప్రసాదరావు సృష్టించిన అరాచకాలకు...
16-04-2019
Apr 16, 2019, 18:52 IST
హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూటకో మాట మాట్లాడుతున్నారని బీజేపీ నేత సుదీశ్‌ రాంబొట్ల విమర్శించారు. హైదరాబాద్‌లో సుదీశ్‌...
16-04-2019
Apr 16, 2019, 18:23 IST
సాక్షి, విజయవాడ : స్వతంత్ర సమర యోధుడు భూమిని కబ్జా చేసేందుకు యత్నించిన వాడు బోండా ఉమా అని రాజకీయ...
16-04-2019
Apr 16, 2019, 18:02 IST
మలి విడత పోలింగ్‌కు ముగిసిన ప్రచారం
16-04-2019
Apr 16, 2019, 17:47 IST
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహా రావు మరోసారి మండిపడ్డారు. ఓటమి భయంతోనే...
16-04-2019
Apr 16, 2019, 17:17 IST
పోలింగ్‌ సందర్భంగా రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామంలో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు సృష్టించిన అరాచకాలపై చర్యలు తీసుకోవాలంటూ వైఎస్సార్‌ సీపీ...
16-04-2019
Apr 16, 2019, 17:10 IST
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌ లోక్‌సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న మేనకా గాంధీ సోమవారం పిలిభిత్‌...
16-04-2019
Apr 16, 2019, 17:07 IST
చండీగఢ్‌ : పంజాబ్‌ మంత్రి, కాంగ్రెస్‌ నేత నవజోత్‌ సింగ్‌ సిద్దూ ఎన్నికల ప్రచారం సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు....
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top