నిజమైన ప్రతిపత్తి కావాలి | Status of actual needs | Sakshi
Sakshi News home page

నిజమైన ప్రతిపత్తి కావాలి

Aug 12 2014 2:51 AM | Updated on Aug 24 2018 1:53 PM

నిజమైన స్వయం ప్రతిపత్తి లేని నేపథ్యంలో ప్రభుత్వ ప్రసారాల సంస్థ.. ‘మోడీ ఇంటర్వ్యూ వివాదం’ లాంటి అవకతవకలను పునరావృతం చేసే ప్రమాదంలో ఉన్నట్టేనని ప్రసారభారతి సీఈఓ జవహర్ సిర్కార్ హెచ్చరించారు.

ప్రసారభారతి సీఈఓ డిమాండ్

న్యూఢిల్లీ: నిజమైన స్వయం ప్రతిపత్తి లేని నేపథ్యంలో ప్రభుత్వ ప్రసారాల సంస్థ.. ‘మోడీ ఇంటర్వ్యూ వివాదం’ లాంటి అవకతవకలను పునరావృతం చేసే ప్రమాదంలో ఉన్నట్టేనని ప్రసారభారతి సీఈఓ జవహర్ సిర్కార్ హెచ్చరించారు. ఆకాశవాణి, దూరదర్శన్‌లకు ఇన్‌చార్జి అరుున సిర్కార్ ఈ విషయమై కేంద్రానికి పలు లేఖలు రాశారు.

సార్వత్రిక ఎన్నికలకు ముందు (ఏప్రిల్‌లో) బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూను దూరదర్శన్ కుదించి ప్రసారం చేసింది. ఇలా ఎడిట్ అరుున భాగాల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియూగాంధీ కుమార్తె ప్రియూంకనుద్దేశించి మోడీ చేసిన వ్యాఖ్యలు  ఉన్నారుు. దీంతో యూపీఏ ప్రభుత్వం పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యం లో ప్రసారభారతికి నిజమైన స్వయం ప్రతిపత్తిని కోరుతూ సిర్కార్ ఈ నెల 8న సమాచార, ప్రసారాల శాఖకు లేఖ రాశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement