ఘోర రోడ్డు ప్రమాదం: కుటుంబమంతా మృతి.. | Seven of family killed in accident | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం: కుటుంబమంతా మృతి..

Mar 22 2017 1:55 PM | Updated on Aug 30 2018 4:10 PM

ఘోర రోడ్డు ప్రమాదం: కుటుంబమంతా మృతి.. - Sakshi

ఘోర రోడ్డు ప్రమాదం: కుటుంబమంతా మృతి..

ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు.

బుర్ద్వాన్‌: పశ్చిమబెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటన  బుధవారం ఉదయం బుర్ద్వాన్‌  జిల్లా తేజ్‌గంజ్‌ సమీపంలోని నేషనల్‌ హైవే-2 పై  చోటుచేసుకుంది. రోడ్డు నిర్మాణానికి తారు తీసుకెళ్తున్న ట్యాంకర్‌ను కారు ఓవర్‌టెక్‌ చేయబోయి ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాల్లో మంటలు చెలరేగాయి.
 
కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందగానే ఫైర్‌ ఇంజన్‌తో మంటలు అదుపు చేశామని పోలీసులు తెలిపారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని, మృతుల్లో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఒక చిన్నారి ఉన్నట్లు  చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాని పోలీసులు తెలిపారు. కాగా రోడ్డు ప్రమాదంతో పోలీసులు రోడ్డును బ్లాక్‌ చేశారు. దీంతో స్థానికులు ఆగ్రహానికి లోనయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement