నరేంద్ర మోడీ ముంబై ర్యాలీకి ఏడంచెల భద్రత | Seven layers of security for Narendra Modi during BKC rally tomorrow | Sakshi
Sakshi News home page

నరేంద్ర మోడీ ముంబై ర్యాలీకి ఏడంచెల భద్రత

Dec 21 2013 10:56 PM | Updated on Mar 29 2019 9:18 PM

నరేంద్ర మోడీ ముంబై ర్యాలీకి ఏడంచెల భద్రత - Sakshi

నరేంద్ర మోడీ ముంబై ర్యాలీకి ఏడంచెల భద్రత

బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఆదివారం ముంబైలో పాల్గొనే ర్యాలీకి అసాధారణ భద్రత ఏర్పాటు చేస్తున్నారు.

బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఆదివారం ముంబైలో పాల్గొనే ర్యాలీకి అసాధారణ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. మోడీ ర్యాలీకి ఏడంచెల భద్రత కల్పిస్తున్నట్టు ముంబై పోలీస్ కమిషనర్ సత్యపాల్ సింగ్ చెప్పారు. వేదిక బాంద్రా కుర్లా కాంప్లెక్స్ కు సమీపంలోని ఎంఎంఆర్డీఏ మైదానం లోపల, వెలుపల మూడు వేల మంది పోలీసులను మోహరించనున్నట్టు తెలిపారు.

ఉగ్రవాదుల నుంచి మోడీకి పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకున్నారు. ఉగ్రవాద నిరోధక సెల్ ను అప్రమత్తం చేశారు. గత నెల నుంచి ముంబైకి వస్తూ ఇక్కడే ఉంటున్న వారిని తనిఖీ చేస్తున్నారు. వేదికకు వెళ్లే అన్ని రహదారులపై ప్రత్యేక నిఘా ఉంచి నాకాబందీ నిర్వహిస్తున్నారు. మోడీ ర్యాలీలో పాల్గొనే ప్రతీ వ్యక్తిని కనీసం రెండుసార్లు తనిఖీ చేయనున్నట్టు పోలీస్ కమిషనర్ చెప్పారు. ఆత్మాహుతి దళాలను దృష్టిలో ఉంచుకుని బాంబు నిర్వీర్య బృందాలను మోహరించినట్టు తెలిపారు. ఈ ర్యాలీలో మోడీతో పాటు బీజేపీ అగ్రనేతలు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, గోపీనాథ్ ముండే తదితరులు పాల్గొంటారు.
 

Advertisement
 
Advertisement
Advertisement