breaking news
Seven layers of security
-
నరేంద్ర మోడీకి ఏడంచెల భద్రత
ముంబై: నగరంలో ఆదివారం జరగనున్న సభకు హాజరవుతున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి పోలీసు శాఖ ఏడంచెల భద్రత కల్పించనుంది. ఈ విషయాన్ని నగర పోలీస్ కమిషనర్ సత్యపాల్ సింగ్ వెల్లడించారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. మోడీకి పటిష్టమైన భద్రత కల్పించామన్నారు. సభ జరగనున్న ఎంఎంఆర్డీఏ మైదానంతోపాటు బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో మూడు వేలమంది పోలీసు సిబ్బందిని మోహరించామన్నారు. మోడీకి పెనుముప్పు పొంచిఉందనే హెచ్చరికల నేపథ్యంలో ఆయనకు ఏడంచెల భద్రత కల్పిస్తున్నామన్నారు. భద్రతా విధుల్లో ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) కూడా పాలుపంచుకుంటుందన్నారు. 30 రోజుల కంటే ముందు నగరానికి వచ్చి, ఇక్కడ ఉంటున్నవారి వివరాలను సేకరిస్తున్నామన్నారు. వేదిక సమీపంలోని మార్గాల్లో నాకాబందీలు నిర్వహిస్తున్నామన్నారు. సభా ప్రాంగణంలో ప్రవేశించే ప్రతి ఒక్కరినీ రెండు పర్యాయాలు తమ సిబ్బంది తనిఖీ చేస్తారన్నారు. ఆత్మాహుతి దళాల ముప్పు అంశాన్ని కూడా తాము పరిగణనలోకి తీసుకున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే సత్వర స్పందన బృందాలను (క్యూఆర్టీ)లను రంగంలోకి దించామన్నారు. వీరితోపాటు బాంబు స్క్వాడ్ బృందాలు వేదిక సమీపంలో విస్తృతంగా తనిఖీలు చేస్తారన్నారు. కాగా మోడీ సభలో బీజేపీ నాయకులు రాజ్నాథ్ సింగ్, రాజీవ్ ప్రతాప్రూడీ, గోపీనాథ్ ముండే, నితిన్ గడ్కరీ తదితరులు పాల్గొంటారు. -
నరేంద్ర మోడీ ముంబై ర్యాలీకి ఏడంచెల భద్రత
బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఆదివారం ముంబైలో పాల్గొనే ర్యాలీకి అసాధారణ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. మోడీ ర్యాలీకి ఏడంచెల భద్రత కల్పిస్తున్నట్టు ముంబై పోలీస్ కమిషనర్ సత్యపాల్ సింగ్ చెప్పారు. వేదిక బాంద్రా కుర్లా కాంప్లెక్స్ కు సమీపంలోని ఎంఎంఆర్డీఏ మైదానం లోపల, వెలుపల మూడు వేల మంది పోలీసులను మోహరించనున్నట్టు తెలిపారు. ఉగ్రవాదుల నుంచి మోడీకి పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకున్నారు. ఉగ్రవాద నిరోధక సెల్ ను అప్రమత్తం చేశారు. గత నెల నుంచి ముంబైకి వస్తూ ఇక్కడే ఉంటున్న వారిని తనిఖీ చేస్తున్నారు. వేదికకు వెళ్లే అన్ని రహదారులపై ప్రత్యేక నిఘా ఉంచి నాకాబందీ నిర్వహిస్తున్నారు. మోడీ ర్యాలీలో పాల్గొనే ప్రతీ వ్యక్తిని కనీసం రెండుసార్లు తనిఖీ చేయనున్నట్టు పోలీస్ కమిషనర్ చెప్పారు. ఆత్మాహుతి దళాలను దృష్టిలో ఉంచుకుని బాంబు నిర్వీర్య బృందాలను మోహరించినట్టు తెలిపారు. ఈ ర్యాలీలో మోడీతో పాటు బీజేపీ అగ్రనేతలు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, గోపీనాథ్ ముండే తదితరులు పాల్గొంటారు.