మొయిలీకి సరస్వతీ సమ్మాన్ పురస్కారం | Saraswati Samman Award to Moily | Sakshi
Sakshi News home page

మొయిలీకి సరస్వతీ సమ్మాన్ పురస్కారం

Mar 10 2015 2:35 AM | Updated on Mar 18 2019 9:02 PM

మొయిలీకి సరస్వతీ సమ్మాన్ పురస్కారం - Sakshi

మొయిలీకి సరస్వతీ సమ్మాన్ పురస్కారం

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ ప్రతిష్టాత్మక సరస్వతీ సమ్మాన్ పురస్కారానికి ఎంపికయ్యారు.

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ ప్రతిష్టాత్మక సరస్వతీ సమ్మాన్ పురస్కారానికి ఎంపికయ్యారు. కన్నడంలో ఆయన రాసిన ప్రసిద్ధ ‘రామాయణ మహాన్వేషణం’ కావ్యానికి గాను దీన్ని ప్రకటించారు. మొయిలీ ఈ కావ్యం ద్వారా లౌకిక, ఆధునిక దృక్పథంతో రామరాజ్యం, ఆదర్శ రాజ్యాల మూలసూత్రాలను అన్వేషించడానికి ప్రయత్నించారని అవార్డు అందిస్తున్న కేకే బిర్లా ఫౌండేషన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్‌సీ లహోటీ నేతృత్వంలోని జ్యూరీ.. మొయిలీని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. అవార్డు కింద రూ. 10 లక్షల నగదు, ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. 2007 లో వెలువడిన ‘రామాయణ మహాన్వేషణం’ ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లోకి అనువాదమైంది.

Advertisement
 
Advertisement
Advertisement