అరుదైన వీడియోను ట్వీట్‌ చేసిన మోదీ | PM Modi also tweeted out an old video of him meeting Vajpayee | Sakshi
Sakshi News home page

అరుదైన వీడియోను ట్వీట్‌ చేసిన మోదీ

Dec 25 2016 8:47 AM | Updated on Aug 21 2018 9:33 PM

అరుదైన వీడియోను ట్వీట్‌ చేసిన మోదీ - Sakshi

అరుదైన వీడియోను ట్వీట్‌ చేసిన మోదీ

మోదీ ఓ అరుదైన వీడియోను ట్వీట్‌ చేశారు

న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారి వాజ్‌పేయి ఆదివారం 92వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్‌ ద్వారా వాజ్‌పేయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 'మా ప్రియమైన అటల్‌ జీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. అతడు మంచి ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నాను' అంటూ మోదీ ట్వీట్‌ చేశారు. అలాగే ఇండియా అభివృద్ధిపథంలో నడవడంలో వాజ్‌పేయి అందించిన సేవలను మోదీ ఈ సందర్భంగా కొనియాడారు.

ఓ పార్టీ కార్యకర్తను కలిసిన సమయంలో అటల్‌ జీ ఏం చేశారో చూడండి అంటూ.. గతంలో తాను కార్యకర్తగా ఉన్న సమయంలో వాజ్‌పేయిని కలిసిన ఓ అరుదైన వీడియోను మోదీ ట్వీట్‌ చేశారు. అనంతరం స్వయంగా కలిసి శుభాకాంక్షలు చెప్పేందుకు వాజ్‌పేయి నివాసానికి మోదీ వెళ్లారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, పార్టీ సీనియర్‌ నేతలు వాజ్‌పేయికి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement