మళ్లీ పెట్రో బాదుడు | Petrol Stroke Again | Sakshi
Sakshi News home page

మళ్లీ పెట్రో బాదుడు

Jun 1 2016 1:28 AM | Updated on Sep 28 2018 3:22 PM

మళ్లీ పెట్రో బాదుడు - Sakshi

మళ్లీ పెట్రో బాదుడు

పెట్రో, డీజిల్ ధరల్ని మంగళవారం మరోసారి పెంచారు. లీటర్ పెట్రోల్‌పై రూ.2.58, డీజిల్‌పై రూ.2.26 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.

న్యూఢిల్లీ: పెట్రో, డీజిల్ ధరల్ని మంగళవారం మరోసారి పెంచారు. లీటర్ పెట్రోల్‌పై రూ.2.58, డీజిల్‌పై రూ.2.26 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. మే 17నే ధరల్ని పెంచిన కంపెనీలు, ఒకే నెలలో రెండోసారి పెంచి మరింత భారం మోపాయి. తాజా ధరల ప్రకారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌కు రూ.65.60, డీజిల్ రూ.53.93 వసూలు చేస్తారు. పెంచిన ధరలు మంగళవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. ముడిచమురు ధరల్లో మార్పులు, డాలర్ మారకం విలువల వల్లే ధరలు పెంచినట్లు ఐఓసీ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement