కరోనా హాట్‌స్పాట్‌గా ముంబై

Mumbai Surpasses China In Coronavirus Deaths And Cases - Sakshi

మహమ్మారి గుప్పిట మహానగరం

ముంబై : కరోనా హాట్‌స్పాట్‌గా మారిన దేశ ఆర్థిక రాజధాని ముంబై మంగళవారం కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్యలో  చైనాను అధిగమించింది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి మహానగరం ముంబై సహా మహారాష్ట్రను తీవ్రంగా వణికిస్తోంది. అధికారిక గణాంకాల ప్రకారం ముంబైలో ఇప్పటివరకూ 85,724 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, మహమ్మారి బారినపడి మరణించిన వారి సంఖ్య 4938కి పెరిగింది. ఇక చైనాలో కరోనా మృతులు 4634 కాగా, పాజిటివ్‌ కేసుల సంఖ్య 83,565గా నమోదైంది. ముంబైలోని అతిపెద్ద మురికివాడ ధారావి ప్రాంతం నుంచి వెల్లడయ్యే కేసుల కంటే తక్కువగా చైనాలో రోజూ పది లోపు తాజా కేసులు వెలుగుచూస్తున్నాయి.

ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారావిలో మహమ్మారి వ్యాప్తి కొంతమేర నియంత్రణలోకి రావడంతో ముంబై అధికారులు ఊపిరి పీల్చుకునన్నారరు. జులై 1 నుంచి ముంబైలో రోజూ 1100కి పైగా తాజా కేసులు నమోదవుతున్నాయి. ముంబైలో రికవరీ రేటు 67 శాతంగా ఉండటం కొంత ఊరట కలిగిస్తోంది. ఇక 2,11,987 కరోనా వైరస్‌ కేసులతో మహారాష్ట్ర ఇప్పటికే టర్కీని (2,05,758) దాటేసింది. జూన్‌ 4న మహారాష్ట్ర కోవిడ్‌-19 కేసుల్లో జర్మనీ (1,98,064)ని, దక్షిణాఫ్రికా (2,05,758)లను అధిగమించింది. రెండులక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదైన మహారాష్ట్రలో మహమ్మారి బారినపడి ఇప్పటివరకూ 9026 మంది మరణించారు. చదవండి : కోవిడ్‌-19 కలకలం : అమల్లోకి 144 సెక్షన్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top