ఆర్థిక రాజధానిలో నిషేధాజ్ఞలు

Mumbai Police Prohibits Movement Of Persons - Sakshi

ముంబైలో 144 సెక్షన్‌

ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబై కరోనా హాట్‌స్పాట్‌గా మారడంతో నిబంధనలను కఠినతరం చేశారు. మహమ్మారి కట్టడికి ముంబై పోలీసులు బుధవారం బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమికూడటాన్ని నిషేధిస్తూ 144 సెక్షన్‌ విధించారు. అత్యవసర పనులు మినహా ఇతర కార్యకలాపాలకు ప్రజలను అనుమతించబోమని ఈ నిషేధాజ్ఞలు జూన్‌ 15 వరకూ కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు. కాగా ముంబై మహానగరంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను జులై 31వరకూ పొడిగించినట్టు మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే.

చదవండి : ముంబైలో లాల్‌బ‌గ్చా గ‌ణేశ్‌ ఉత్స‌వాలు ర‌ద్దు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top