మోడీ మేజిక్‌కు కాలం చెల్లింది: తృణమూల్ కాంగ్రెస్ | Modi Magic expire : Tanamul Congress | Sakshi
Sakshi News home page

మోడీ మేజిక్‌కు కాలం చెల్లింది: తృణమూల్ కాంగ్రెస్

Sep 16 2014 8:43 PM | Updated on Aug 21 2018 9:38 PM

ముకుల్ రాయ్ - Sakshi

ముకుల్ రాయ్

ప్రధాని నరేంద్ర మోడీ మేజిక్‌కు కాలం చెల్లిందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ రాయ్ అన్నారు.

 కోల్‌కతా: ప్రధాని  నరేంద్ర మోడీ మేజిక్‌కు కాలం చెల్లిందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ  ప్రధాన కార్యదర్శి ముకుల్ రాయ్ అన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే మోడీ మాయాజాలం అంతరించిందని విమర్శించారు.  మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారని చెప్పారు.

 బీజేపీపై ప్రజల విశ్వాసం సన్నగిల్లుతోందని ఈ ఉప ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయన్నారు. పశ్చిమబెంగాల్‌లో 2016లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తామే ఘనవిజయం సాధిస్తామని ముకుల్ రాయ్ ధీమా వ్యక్తం చేశారు.
**

Advertisement
 
Advertisement
Advertisement