'రైతులకు కాదు.. రియల్టర్లకు లాభం' | Medha patkar talks on Amaravati capital construction | Sakshi
Sakshi News home page

'రైతులకు కాదు.. రియల్టర్లకు లాభం'

Aug 30 2016 7:19 PM | Updated on Jun 4 2019 5:16 PM

'రైతులకు కాదు.. రియల్టర్లకు లాభం' - Sakshi

'రైతులకు కాదు.. రియల్టర్లకు లాభం'

ల్యాండ్ పూలింగ్తో రైతులకు కాదు, రియల్టర్లకే లాభమని మేథా పాట్కర్ చెప్పారు.

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి కోసం ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్తో రైతులకు కాదు, రియల్టర్లకు మాత్రమే లాభం చేకూరుతుందని సామాజికవేత్త మేథా పాట్కర్ విమర్శించారు. మంగళవారం ఢిల్లీలో మేథా మాట్లాడారు. అమరావతి ప్రస్తుత నిర్మాణంతో అన్ని వృత్తులవారి జీవన పరిస్థితులు తీవ్రంగా ప్రభావితమతున్నాయని ఆమె అన్నారు.

వరదలు వస్తే సగం నగరం తుడిచి పెట్టుకుపోతుందని మండిపడ్డారు. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించి అమరావతి నిర్మించాలని మేథా పాట్కర్ డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement