పెళ్లయిన మరుసటి రోజే వరుడు ఆత్మహత్య.! | man commits suicide after his marriage | Sakshi
Sakshi News home page

పెళ్లయిన మరుసటి రోజే వరుడు ఆత్మహత్య.!

Feb 7 2018 8:01 AM | Updated on Nov 6 2018 8:22 PM

man commits suicide after his marriage - Sakshi

కర్ణాటక (చిక్కబళ్లాపురం): పెళ్లయిన మరుసటి రోజే వరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన  జిల్లా కేంద్రం చిక్కబళ్లాపుర సమీపంలోని సూలికుంటె గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు...సూలికుంటె గ్రామానికి చెందిన మునిరాజు (30)కు అక్క కూతురు చైత్రలో ఆదివారం చిక్కబళ్లాపురం గురరాజ కళ్యాణ మంటపంలో పెళ్లి జరిగింది. అనంతరం కళ్యాణ మండపం నుంచి ఇంటికి వచ్చారు. అయితే సోమవారం రాత్రి మునిరాజు ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేఈబీలో లైన్‌మెన్‌గా పనిచేస్తున్న ముని రాజు డెత్‌నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.  అక్క కుమార్తెను వివాహం చేసుకోవటం ఇష్టం లేదని, బలవంతంగా వివాహం చేశారని,  ఆమెను తన సోదరుడికే ఇచ్చి వివాహం చేయాలని అందులో పేర్కొన్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement