కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం | lorry and car collisioned in karnataka | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

May 13 2017 8:14 AM | Updated on Aug 30 2018 4:10 PM

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి ఐదుగురు మృత్యువాత పడ్డారు.

బీదర్: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి ఐదుగురు మృత్యువాత పడ్డారు. బీదర్ సమీపంలోని 9వ నెంబర్ జాతీయ రహదారిపై లారీ-కారు ఢీకొన్నాయి. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement