10 మంది భారత జాలర్లను శ్రీలంక నేవీ అధికారులు అరెస్ట్ చేశారు.
10 మంది భారత జాలర్ల అరెస్ట్
Mar 21 2017 4:28 PM | Updated on Sep 5 2017 6:42 AM
కొలంబో: శ్రీలంక సముద్ర జలాల్లోకి ప్రవేశించిన 10 మంది భారత జాలర్లను శ్రీలంక నేవీ అధికారులు అరెస్ట్ చేశారు. సముద్రంలో జాలర్లు ప్రయాణించడానికి ఉపయోగించిన ఓ బోటును కూడా స్వాధీనం చేసుకున్నారు. జాలర్లు అక్రమంగా మా జలాల్లోకి ప్రవేశించడం ఆపకపోతే అరెస్ట్‌లు కొనసాగుతాయని శ్రీలంక మత్స్యకార మంత్రి మహీంద్ర అమరవీర ప్రకటించారు. సముద్రజలాల వివాదంపై వచ్చేనెలలో సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లు మంత్రి తెలిపారు. గత నెలలో శ్రీలంక నేవీ జరిపిన కాల్పుల్లో తమిళనాడుకు చెందిన ఓ జాలరి చనిపోయిన సంగతి తెల్సిందే.
Advertisement


