ఈసీపై నమ్మకం పోతోంది!? | its not a good thing | Sakshi
Sakshi News home page

ఈసీపై నమ్మకం పోతోంది!?

Oct 21 2017 4:15 PM | Updated on Aug 14 2018 4:34 PM

its not a good thing - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రానికి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం.. గుజరాత్‌కు కూడా షెడ్యూల్‌ ప్రకటించాలని జేడీయూ బహిష్కృత నేత రాజ్యసభ ఎంపీ శరద్‌యాదవ్‌ పేర్కొన్నారు. గుజరాత్‌ ఎన్నికల తేదీను ప్రకటించకపోవడం అనేది ఎన్నికల సంఘంపై అనుమానాలు రేకెత్తించేలా ఉందని ఆయన అన్నారు.

అవినీతి విషయంలో బీజేపీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని.. ఇంకు అమిత్‌ షా తనకుడు జై షా వ్యవహారం నిదర్శనమని ఆయన చెప్పారు. దేశ ప్రజలకు ఎన్నికల సంఘంపై నమ్మకం, విశ్వాసం ఉన్నాయని.. అవి సడలకముందే గుజరాత్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement