జమ్మూ కాశ్మీర్ లో కాల్పులు: తీవ్రవాదులు హతం | Five militants killed in Jammu and Kashmir gunfight | Sakshi
Sakshi News home page

జమ్మూ కాశ్మీర్ లో కాల్పులు: తీవ్రవాదులు హతం

Dec 3 2014 8:37 AM | Updated on Apr 4 2019 5:25 PM

జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో తీవ్రవాదులకు, భద్రత సిబ్బందికి మధ్య జరిగిన హోరాహోరి కాల్పుల్లో అయిదుగురు తీవ్రవాదులు మరణించారని ఆర్మీ ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు.

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో తీవ్రవాదులకు, భద్రత సిబ్బందికి మధ్య జరిగిన హోరాహోరి కాల్పుల్లో అయిదుగురు తీవ్రవాదులు మరణించారని ఆర్మీ ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఇద్దరు సైనికులు గాయపడ్డారని ... వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.  మరో ఇద్దరు తీవ్రవాదులు నవ్గామ్ ప్రాంతంలో భారత్లోని ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో భద్రత దళాలు వెంటనే అప్రమత్తమై కాల్పులు జరపగా... ఆ ఇద్దరు తీవ్రవాదులు మృతి చెందారని చెప్పారు.

కుప్వారాలోని అసెంబ్లీ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరిగిన నేపథ్యంలో నోవ్గామ్ ప్రాంతంలో తీవ్రవాదులు చోరబడకుండా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఉన్నతాధికారులు వివరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement