విపక్షాలకు ఎదురుదెబ్బ | Sakshi
Sakshi News home page

వీవీప్యాట్‌ల లెక్కింపుపై విపక్షాలకు ఈసీ షాక్‌

Published Wed, May 22 2019 3:22 PM

Ec Denies To Change In Counting Process - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వీవీప్యాట్‌ల లెక్కింపు వ్యవహారంలో విపక్షాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లెక్కింపు ప్రక్రియను మార్చేందుకు నిరాకరించిన ఈసీ ముందుగా ఈవీఎంల లెక్కింపు జరుగుతుందని స్పష్టం చేసింది. ముందుగా 5 వీవీప్యాట్‌లను లెక్కించాలని విపక్షాలు మంగళవారం ఈసీని కలిసి వినతిపత్రం సమర్పించిన సంగతి తెలిసిందే.

మరోవైపు ఈవీఎం, వీవీప్యాట్‌లపై రాద్ధాంతానికి స్వస్తిపలికి లెక్కింపు ప్రక్రియకు సహకరించాలని, ఫలితాలను అంగీకరించాలని బీజేపీ కోరింది. విపక్షాలు మాత్రం ఈసీ తీరును తప్పుపడుతున్నాయి. వీవీప్యాట్‌ల లెక్కింపునకు ఈసీకి ఉన్న అభ్యంతరమేంటని ప్రశ్నించాయి. ఇక వీవీప్యాట్‌ల లెక్కింపు సంఖ్యను పెంచాలన్న విపక్షాల అప్పీల్‌ను తోసిపుచ్చిన సుప్రీం కోర్టుపై కాంగ్రెస్‌ నేత, వాయువ్య ఢిల్లీ మాజీ ఎంపీ ఉదిత్‌ రాజ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement
Advertisement