'ఇది త‌యారు చేసినవాడిని చంపేస్తా’ | Chocolate Maggi: Another Disaster | Sakshi
Sakshi News home page

చాక్లెట్ మ్యాగీ: ఇదో విప‌త్తు

Jun 21 2020 5:02 PM | Updated on Jun 21 2020 8:02 PM

Chocolate Maggi: Another Disaster - Sakshi

చాలు, ఇక చాలు, ఈ ఘోరాలు తాము చూడ‌లేమంటూ ఆహార‌ప్రియులు సోష‌ల్‌మీడియాలో వాపోతున్నారు. ఈ సారి ఎలాంటి భ‌యంక‌ర వంట‌కం పుట్టుకొచ్చిందోన‌ని బెదిరిపోకండి. కానీ ఈ ఫుడ్‌ ప్ర‌యోగం మాత్రం అటు చాక్లెట్ ప్రేమికుల‌కు, ఇటు మ్యాగీ ప్రియుల‌కు కోపం తెప్పించ‌క మాన‌దు. ఇప్ప‌టికే ఈ ప‌దార్థం ఏంటో అర్థ‌మై ఉంటుంది. అదే "చాక్లెట్ మ్యాగీ". నూటికి ఒక్క‌రు మాత్ర‌మే ఈ వంట‌కంపై ఆస‌క్తి చూపిస్తుండ‌గా మిగ‌తా 99మంది మాకొద్దు బాబోయ్ అంటూ ప‌రుగులు తీస్తున్నారు. (తినే మ్యాగీ కాళ్ల కింద; నలిగిపోయిందా?)

చాక్లెట్‌, మ్యాగీని క‌ల‌ప‌డాన్ని "ఉగ్ర‌వాద చ‌ర్య‌, రాక్ష‌స‌త్వం, ఆహార విప‌త్తు, 2020లో ఇలాంటి ఘోరాలు ఇంకా ఎన్ని చూడాల్సి వ‌స్తుందో" అంటూ నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. మ‌రో నెటిజ‌న్ మాత్రం "ఈ రెసిపీ చేసినవాన్ని చంపేస్తా" అంటూ ఆవేశంతో ఊగిపోయాడు. కాగా గ‌తంలో "మ్యాగీ పానీపూరి" అనే విభిన్న వంట‌కం భోజ‌న ప్రియుల‌కు వికారం క‌లిగించిన విష‌యం తెలిసిందే. అస‌లు ఈ పేరు విన‌డానికే ఇబ్బందిగా ఉందంటూ నెటిజ‌న్లు పెద‌వి విరిచారు. అయిన‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో రోజుకో కొత్త వంట‌కం పుట్టుకొస్తూనే ఉంది.  ('ఛీ, విన‌డానికే ద‌రిద్రంగా ఉంది')

Advertisement
 
Advertisement
Advertisement